Mexican Woman Killed : 5వేల కి.మీ ప్రయాణించి తన కోసం వచ్చిన ప్రియురాలిని హత్య చేసి అవయవాలు అమ్ముకున్నాడు

ఓ యువతి తన ప్రియుడి కోసం 5వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వెళ్తే.. అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. అవయవాలను అమ్ముకునేందుకు ప్రేమించిన వాడే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసి అంతా షాక్ అయ్యారు.

Mexican Woman Killed : 5వేల కి.మీ ప్రయాణించి తన కోసం వచ్చిన ప్రియురాలిని హత్య చేసి అవయవాలు అమ్ముకున్నాడు

Mexican Woman Killed : ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ప్రేమ పేరుతో కొందరు కిరాతకులు ఘోరాలకు తెగబడుతున్నారు. ప్రేమించినట్లు నటించి ప్రాణాలు తీస్తున్నారు. ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తన లివింగ్ పార్టనర్ ను అఫ్తాబ్ అత్యంత కిరాతకంగా చంపాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. శ్రద్ధ డెడ్ బాడీని ముక్కలుగా కోసి, ఆ ముక్కలను వేర్వేరు చోట్ల పడేశాడు. 6 నెలల క్రితం జరిగిన ఈ ఘోరం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

ఇలాంటి దారుణమే ఒకటి పెరూలో చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రియుడి కోసం 5వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వెళ్తే.. అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. అవయవాలను అమ్ముకునేందుకు ప్రేమించిన వాడే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసి అంతా షాక్ అయ్యారు.

Mexican woman killed

వివరాల్లోకి వెళితే.. ప్రియుడిని కలవాలని మెక్సికో నుంచి పెరూకు దాదాపు 5వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లిన ఓ మహిళ హువాచో బీచ్ లో శవమై తేలింది. బ్లాంకా అరెల్లానో (51) ఆన్ లైన్ లో పరిచయమైన జువాన్ పబ్ లో వద్దకు వెళ్లింది. వారం రోజుల పాటు ఆమెతో గడిపిన జువాన్.. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆమె అవయవాలను అమ్మేశాడు. ఈ నెల 7 తర్వాత ఆమె నుంచి సమాచారం లేకపోవడంతో బంధువులు ఫిర్యాదు చేయగా ఈ షాకింగ్ విషయం వెలుగుచూసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తాను తన ప్రియుడు జువాన్(37) ను కలిసేందుకు వెళ్తున్నట్లు మెక్సికోకి చెందిన బ్లాంకా ఇంట్లో వాళ్లకు చెప్పింది. జూలైలో ఆమె పెరూకి పయనమైంది. జువాన్ ఆమెకు ఆన్ లైన్ లో పరిచయం అయ్యాడు. చాలా కాలంగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. బ్లాంకా ప్రియుడు జువాన్ హువాచో బీచ్ లో నివాసం ఉంటాడు. దీంతో అతడిని కలిసేందుకు బ్లాంకా బీచ్ సిటీకి పయనం అయ్యింది. అయితే, నవంబర్ 7వ తేదీ వరకు బ్లాంకా తన కుటంసభ్యులతో టచ్ లో ఉంది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దారుణం వెలుగులోకి వచ్చింది.

Mexican woman killed

కాగా, నవంబర్ 7న కూడా బ్లాంక్ తన బంధువులతో మాట్లాడింది. ఇద్దరి మధ్య రిలేషన్ బాగుందని, తాను ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. ఆమెతో కుటుంబసభ్యులు మాట్లాడటం అదే చివరిసారి. రెండు వారాలు ఎలాంటి సమాచారం లేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ప్రియుడు జువాన్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా.. షాకింగ్ నిజం వెలుగుచూసింది. అవయవాలు అమ్ముకునేందుకు తానే బ్లాంకాను హత్య చేసినట్లు జువాన్ నేరాన్ని అంగీకరించాడు.