China : ‘ఫుల్ టైం డాటర్’ తల్లిదండ్రులు కూతురికి ఇచ్చిన ఉద్యోగం

కూతురు కష్టపడుతుంటే చూసి బాధ పడ్డారో ఏమో? చైనాలో పేరెంట్స్ కూతుర్ని తమ దగ్గర ఉద్యోగంలో పెట్టుకున్నారు. అదీ ఫుల్ టైం డాటర్‌గా.. అదేంటి విచిత్రంగా ఉందని అనుకుంటున్నారా? అందుకోసం జీతం కూడా ఇస్తున్నారు. ఇంతకీ ఉద్యోగంలో ఆమె బాధ్యతలు ఏంటో చదవండి.

China : ‘ఫుల్ టైం డాటర్’ తల్లిదండ్రులు కూతురికి ఇచ్చిన ఉద్యోగం

China

China Viral News : ఈ రోజుల్లో ఆడవారైనా మగవారైనా తల్లితండ్రుల బాధ్యతల్లో పాలు పంచుకుంటున్నారు. అయితే ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ చేస్తున్న జాబ్ మానేసింది. తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ వారితోనే ఉంటోంది. ఇప్పుడు ఆమె చేసే ఉద్యోగం పేరు ‘ఫుల్ టైం డాటర్’. అందుకోసం తల్లిదండ్రులు ఆమెకు జీతం కూడా ఇస్తున్నారు. విచిత్రంగా అనిపిస్తోంది కదా.. చదవండి.

Diabetes Oral Insulin : మధుమేహానికి ఓరల్ ఇన్సులిన్.. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో

చైనాకు చెందిన నియానన్ అనే మహిళ చేస్తున్న జాబ్ గురించి ఆసక్తికరమైన కథ ఇది. ఏడాది క్రితం వరకూ ఆమె న్యూస్ ఏజెన్సీలో జాబ్ చేసేది. ఆ జాబ్‌లో ఉండగా తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఉద్యోగం మానేయాలని అనుకున్నా జీవనోపాధి కష్టమైపోతుందని భావించిన నియానన్‌కు తల్లిదండ్రులు ఆ జాబ్ మానేయమని సలహా ఇచ్చారు. వారు ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. నియానన్ ఇంట్లోనే ఉండి తమ మంచి చెడ్డలు చూసుకుంటే నెలకు 4 వేల యువాన్‌లు (46,747.80 ఇండియన్ కరెన్సీలో) ఇస్తామని చెప్పారు. ఇంకేం వెంటనే ఆమె చేసే ఉద్యోగం మానేసి ‘ఫుల్ టైం డాటర్’ జాబ్‌లో జాయిన్ అయ్యింది.

 

నియానన్‌‌కు ఈ జాబ్ చాలా బాగుందట. తల్లిదండ్రులతో మార్కెట్ కి వెళ్లడం..వంట చేయడం.. డ్రైవింగ్ చేయడం.. వారితో కలిసి డ్యాన్స్ చేయడం.. నెలలో రెండు ట్రిప్‌లు వారిని బయటకు తీసుకువెళ్లడం.. ఇవే ఆమె ఉద్యోగంలో చేసే పనులు. నియానన్ తల్లిదండ్రులకు నెలకు లక్ష యువాన్ల వరకూ (11,68,695.00 ఇండియన్ కరెన్సీలో) పెన్షన్ వస్తుందట.. అందులోంచి 4 వేల యువాన్లు కూతురికి జీతంగా ఇస్తున్నారు. ఆమెకు ఎంతకాలం ఈ జాబ్ లో కొనసాగాలనుకుంటే అంతకాలం కొనసాగమని.. లేదంటే తమతోనే ఉండమని కూడా తల్లిదండ్రులు ఆమెకు భరోసా ఇచ్చారు.

China: 78 ఏళ్ల అమెరికా పౌరుడికి చైనా యావజ్జీవ కారాగార శిక్ష.. ఎందుకంటే?

అయితే నియానన్ తల్లిదండ్రులపై ఆధారపడి బతకడాన్ని కొందరు విమర్శిస్తుంటే కొందరు తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.