Mecca Yathra : హజ్ యాత్రలో భద్రతకోసం తొలిసారి మహిళా సైనికులు

యాత్రికుల ప్రయాణంలో భద్రతను నిరంతరం పర్యవేక్షించటంతోపాటు, మసీదు అల్ హరామ్ వద్ద కాపాలాగా మహిళా సైనికులను ఏర్పాటు చేశారు.

Mecca Yathra : హజ్ యాత్రలో భద్రతకోసం తొలిసారి మహిళా సైనికులు

Mkka (1)

Mecca Yathra : ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనుకుంటారు. పుణ్యక్షేత్రమైన మక్కాను సందర్శిస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని భావిస్తారు. ఎన్నో వ్యయప్రయాలకోర్చి మక్కాను సందర్శిస్తారు. పెద్ద సంఖ్యలో వస్తే వారికి అవసరమైన సౌకర్యాలు, భద్రత కల్పించటం కత్తిమీద సాములాంటిదే.. అయితే సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రతిఏటా యాత్రికుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంది. భద్రత విషయంలో ఇప్పటి వరకు పురుష సైనికులను మాత్రమే వినియోగించేవారు. అయితే తాజాగా మహిళా సైనికులను భద్రతకోసం నియమించారు.

యాత్రికుల ప్రయాణంలో భద్రతను నిరంతరం పర్యవేక్షించటంతోపాటు, మసీదు అల్ హరామ్ వద్ద కాపాలాగా మహిళా సైనికులను ఏర్పాటు చేశారు. వీరికి ప్రత్యేక మైన డ్రెస్ కోడ్ ను రూపొందించారు. ఖాకీ షర్టు, ఫ్యాంటుతోపాటు, మూతికి నల్లని మాస్కు, తలపై నల్లని టోపి ధరిస్తున్నారు. మక్కాలో మహిళా సైనికులను ఏర్పాటుగాను సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచదేశాలు స్వాగతిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మక్కా చరిత్రలో తొలిసారిగా మహిళా సైనికులు భద్రతను పర్యవేక్షిస్తుంటంపట్ల అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా నేపధ్యంలో ఈ ఏడాది వివిధ దేశాల నుండి 60వేల మంది యాత్రికులకు మాత్రమే అనుమతిలభించింది. గతంలో ప్రతిఏటా 2.5 మిలియన్ల మంది మక్కాను సందర్శించేవారు. కరోనా కారణంగా యాత్రికుల రద్దీని తగ్గించేలా సౌదీ అరేబియా పలు చర్యలను చేపట్టింది. మరోవైపు హజ్ యాత్రకు వచ్చిన వారికి అక్కడి ప్రభుత్వం వ్యాక్సిన్ టీకాలను తప్పనిసరిచేసింది. యాత్రికులకు ఉచితంగానే టీకాలను అందిస్తున్నారు. టీకాలు వేసుకున్న వారిని పవిత్రస్ధల సందర్శనకు అనుమతిస్తున్నారు. సామాజిక దూరంతోపాటు , మాస్కు నిబంధనలను తప్పనిసరి చేశారు.