World Mental Health Day 2020 : ఒత్తిడిని జయించండి..హాయిగా నిద్రపోండి..

  • Published By: nagamani ,Published On : October 10, 2020 / 03:06 PM IST
World Mental Health Day 2020 : ఒత్తిడిని జయించండి..హాయిగా నిద్రపోండి..

ఈరోజు అక్టోబర్ 10 World Mental Health Day : ఆరోగ్యంగా ఉండటంమంటే కేవలం శారీరకంగానే కాదు..మానసికంగాకూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు. అలా పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. హాయిగా నిద్రపోతే జీవితంకూడా ప్రశాంతంగా సాగిపోతుంది. నిద్రపోవటం చాలా రకాలున్నాయంటారు నిపుణులు. కలత నిద్ర..మొద్దునిద్ర..సుఖ నిద్ర. నిద్రపోవటమంటే మొద్దునిద్రపోవటం కాదు సుఖంగా నిద్రపోవటం. మన పడుకున్న ప్రాంతం ఏదైనా అంటే పరుపుమీదైనా కటిక నేలమీదైనా హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే ప్రశాంతంగా ఉన్నట్లే. అటువంటిదాన్నే సుఖ నిద్ర అంటారు. అలా నిద్రపోవాలంటే ఒత్తిడిని జయించాలి. మానసింకంగా ఆరోగ్యంగా ఉంటేనే సుఖంగా నిద్రపోగలం అంటున్నారు మానసిక నిపుణులు. ఈరోజు అంటే..అక్టోబర్ 10 World Mental Health Day సందర్భంగా ప్రతీ ఒక్కరూ హాయిగా నిద్రపోవాలని దానికి సంబంధించి మానసిక ఒత్తిడిని జయించాలంటున్నారు.


ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 న జరుపుకునే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం లక్ష్యంతోనే ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రతీ ఏటా జరుపుకుంటున్నాం.


ఈ లక్ష్యం నెరవేరాలంటే..ప్రతీ ఒక్కరూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యానికి కంటినిండా నిద్ర ఎంతగానే దోహదపడుతుందని మానసిక వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.


నేటి బిజీ బిజీ లైఫ్ లో ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య మానసిక ఒత్తిడి. ఉద్యోగమైనా, కుటుంబ సమస్యలైనా, చదువు విషయంలోనైనా చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలు మానసిక సమస్యతో బాధపడుతున్నారు. శరీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. మానసిక ఆరోగ్యానికి కంటినిండా నిద్ర ఎంతగానో దోహదపడుతుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


మానసిక ఒత్తిడిని జయించి…ఉత్సాహంగా ఉండాలంటే ప్రతీ రోజూ చక్కగా నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హాయిగా నిద్రపోవడం వల్ల మనసు..మెదడు ప్రశాంతంగా ఉంటాయి. అందువల్ల ఒత్తిడి వంటి మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

రాత్రిపూట ఆలస్యంగా పడుకుని ఉదయాన పొద్దెక్కాక ఆలస్యంగా లేచేవారికన్నా..రాత్రి త్వరగా పడుకుని తెల్లవారగానే లేచేవారు ఉత్సాహంగా పనులన్నీ పూర్తిచేసుకుంటారని మానసిన నిపుణులు జరిపిన పలు సర్వేల ద్వారా వెల్లడైంది.


సరైన సుఖనిద్ర మనసును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మరింత ఉత్సాహంగా ఉదయం లేవటానికి అవకాశం ఉంటుంది. దీంతో మానిసక ఒత్తిడి కూడా దరిచేరదని డాక్టర్లు సూచిస్తున్నారు.


మానిసకంగాను..శారీకంగాను ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం.. ఒకేసమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి..ప్రతీ రోజు ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. దీంతో మానసిక, శారీరక సమస్యలు దరిచేరని నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతీరోజు దినచర్యలో అలవాటు చేసుకుంటే ఎటువంటి సమస్యలనైనా అధిగమించవచ్చు. కఠిన సమస్యలకు కూడా పరిష్కరించవచ్చు..దీనికి కావాల్సిందల్లా..మానసిక ప్రశాంతత. అదే ఈ World Mental Health Day లక్ష్యం.