Most Expensive Pet : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే!

మీరెప్పుడైనా రూ.117 కోట్ల ధర పలికిన గుర్రం గురించి విన్నారా? కుక్క ధర రూ.117 కోట్లు అనే విషయం మీకు తెలుసా?.. మీరు ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పెంపుడు జంతువుల తెలుసుకోండి.

Most Expensive Pet :  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే!

Most Expensive Pet

Most Expensive Pet : జంతువులను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. కొందరు కుక్కలను పెంచుకుంటే కొందరు పిల్లులు, అరుదైన రకాల పక్షులను పెంచుకుంటారు. తమ ఇంట్లో ఒకరిగా చూస్తారు. వాటికి ఏదైనా జబ్బుచేస్తే వేలకు వేలు ఖర్చు చేసి హాస్పిటల్ లో చూపిస్తారు. తమ ఇంట్లో మనిషికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక అరుదైన జాతి జంతువులను లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన జంతువులు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

New Project (5)

గ్రీన్‌ మంకీ – థ్రోగ్‌బ్రెడ్‌ రేస్‌ హార్స్‌.. రూ.117 కోట్లు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెంపుడు జంతువుగా అమెరికాకు చెందిన మగ రేసు గుర్రం గ్రీస్ మంకీ నిలుస్తుంది. ఈ గుర్రం తొలిరేసులో అత్యంత వేగంగా పరుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో దీనికి రూ.117 కోట్లు చెల్లించి కోలుగోలు చేశారు. ఇక దీని వీర్యం కూడా ఖరీదైనది కావడంతో ఈక్వెస్ట్రియన్‌ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. అందువల్ల దీనిని పోటీ పడి కొన్నారు.

Read More : Samantha Akkineni: సమంతకు సొంత బిడ్డలైన హ్యాష్, సాషా..!

Dog

సర్‌ లాన్స్‌లాట్‌ ఎన్‌కోర్‌ – లాబ్రడార్‌..117 కోట్లు

ప్రపంచంలో అత్యధిక మంది ఇష్టపడే జంతువు శునకం. చాలామంది వేటినిపడితే వాటిని పెంచకుండా మేలిరకం శునకాలను పెంచుతుంటారు. అయితే వీటి ధర భారీగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చిత్రంలో చూస్తున్న శునకం ధర రూ.117 కోట్లు లాబ్రడార్‌ అద్భుతమైన కుక్క. అందుకే దీనికి అంత రేటు. ఏంటా అద్భుతం అంటే.. ఇది పూర్తిగా క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా ప్రపంచంలోనే విజయవంతంగా జన్మించిన శునకం. అందువల్లే దీనికి అంత రేటు అన్నమాట.

Cow

మిస్‌ మిసీ – ఆవు రూ. 8.82 కోట్లు

చాలామంది ఆవులను పాల కోసం పెంచుకుంటారు. ఆవు ధర అది ఇచ్చే పాలను బట్టి ఉంటుంది. మన దేశంలో అయితే రూ. 50 నుంచి రూ. 10 లక్షల మధ్య మేలుజాతి ఆవులు లభిస్తాయి. అయితే ఇప్పుడు మనం ఫొటోలో చూస్తున్న ఆవు ధర అక్షరాలా రూ.8.82 కోట్లు. ఆవు ఇంత ఖరీదా… అని మనం నోరెళ్లబెట్టవచ్చు. అయినా.. ఈ హోలిస్టీన్‌ ఆవు ప్రత్యేకతలు అలాంటివి మరి. ఆవుల పోటీల్లో పలు అవార్డులు పొందడంతో దీనికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. దీని పొదుగు కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంతేగాక సాధారణ ఆవుల కంటే కనీసం 50 శాతం ఎక్కువగా పాలిస్తుంది.

Read More : Woman Scarf Made with Dogs Fur : పెంపుడు కుక్క‌ల బొచ్చుతో స్కార్ఫ్‌..మెడలో వేసుకుని మురిసిపోతున్న యజమాని

Red Dog

 

రెడ్‌ ప్యూర్‌ బ్రీడ్‌ టిబెటిన్‌ మాస్టిఫ్‌… 4.28 కోట్లు

మనం పైన చెప్పుకున్న శునకం పూర్తిగా క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా పుట్టింది. కానీ ఇప్పుడు ఈ ఫొటోలో చూస్తున్న శునకం సాధారణ ప్రక్రియ ద్వారా పుట్టిన అత్యంత ఖరీదైన శునకం. రెడ్‌ ప్యూర్‌ బ్రీడ్‌ టిబెటిన్‌ మాస్టిఫ్‌ గా పిలువబడే దీని ధర రూ.4.28 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శునకం. ఈ జాతి అత్యంత అరుదైనది కావడంతోనే దీనికి ఆ రేటు. ముందు నుంచి చూస్తే అచ్చం సింహం ఆకారంలో ఉంటుంది. మనుషులతో స్నేహ పూర్వకంగా మెలుగుతాయి. ఇప్పుడు వీటిని ఇతర శునకాలతో క్రాస్‌ బ్రీడ్‌ చేస్తున్నారు. క్రాస్ బ్రీడ్ ధర కొంచం తక్కువే ఉంటుంది.. కానీ ఒరిజినల్‌ బ్రీడ్‌ మాత్రం అత్యంత ఖరీదైనదే.

Read More : Vijay: తల్లిదండ్రులపై కేసు పెట్టిన హీరో విజయ్.. కారణం ఇదే!

 

White Lion

తెల్ల సింహం కూన రూ. 1.03 కోట్లు

చాలా దేశాల్లో క్రూర మృగాలను పెంచడం చట్టరీత్య నేరం. భారత్ వంటి దేశాల్లో పులులు సింహాలను పెంచితే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి జైల్లో పెడతారు. అయితే కొన్ని దేశాల్లో సింహం, పులి వంటి క్రూర జంతువులను పెంచుకునేందుకు అనుమతి ఉంది. క్రూర జంతువులను పెంచే వారిని సోషల్ మీడియాలో చాలామంది చూసే ఉంటాం. అయితే క్రూర మృగాల్లో చాలా ఖరీదైనది తెల్ల సింహం. దీని పిల్ల ఖరీదు కోటి రూపాయలకుపై మాటే. ఒక్క కూనను విడిగా అమ్మరు కాబట్టి.. రెండు కూనలను కొన్నాల్సి వస్తుంది. అంటే రూ. 2.06 కోట్లు పెట్టాల్సిందే. సింహాల్లో అత్యంత అరుదైన రంగు కాబట్టి వీటికి ఆ రేటు. కొన్ని దేశాల్లో వీటిని పెంచుకోవడానికి అనుమతి ఉంది.

New Project (1)

అరేబియన్‌ గుర్రం రూ. 70 లక్షలు

అరేబియన్ దేశాల్లో గుర్రాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అరుదైన జాతి గుర్రాలు ఈ ప్రాంతంలో అధికంగా లభిస్తుంటాయి. రాజకుటుంబికులు గుర్రాళ్లను పెంచేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు మనం ఫొటోలో చూస్తున్న గరం అరేబియన్‌ జాతికి చెందింది. చాలా పురాతనమైన జాతిగా దీనికి పేరుంది. సుదీర్ఘమైన ప్రయాణాలకు, ఈక్వెస్ట్రియన్‌ క్రీడలకు అనువైనవి. మనుషులతో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉంటాయి. కొంచెం ఖర్చు ఎక్కువైనా.. మంచి పెట్టుబడిగా దీనిని పెంచుకునే వాళ్లు భావిస్తారు. ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి.

 

New Project (2)

చింపాంజీ రూ. 44.14 లక్షలు

చింపాంజీలకు మనుషులకు దగ్గరి సంబంధం ఉంటుంది. మనుషులు చింపాంజీల నుంచే వచ్చారని చెబుతుంటారు. మనుషుల తర్వాత తెలివైన జీవులుగా వీటికి పేరుంది. ఇవి మనుషులకు బాగా దగ్గర అవుతాయి. యజమానులతో ఆటలు ఆడుతాయి, నవ్విస్తాయి, ఆనందం పంచుతాయి. ఇక వీటిలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి బొనోబో, రెండోది సాధారణ చింపాజీ. చాలా దేశాల్లో వీటిని పెంచుకోవడానికి అనుమతి ఉంది. అయితే వీటికి తిండిపెట్టడం మాత్రం చాలా కష్టం.. వీటి రోజువారీ ఖర్చు అధికంగా ఉంటుంది. ఇక వీటి ధర కూడా అధికమే.

 

 

New Project (3)

లావెండర్‌ అల్బినో బాల్‌ పైథాన్‌ రూ. 30 లక్షలు

పామును చూస్తే ఎగిరి గంతేస్తారు.. అది కనిపించిన ప్రాంతానికి మరోసారి రావాలి అంటే వణికిపోతారు. అయితే కొందరు భయపడితే మరికొందరు ఇష్టపడుతుంటారు. పాముల లవర్ తమ ఇంట్లో పెంచుకుంటుంటారు. వాటిని చాలా ధర పెట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే లావెండర్‌ అల్బినో బాల్‌ పైథాన్‌ ఆఫ్రికా ఖండానికి చెందిన చిన్న సైజు కొండచిలువ. ఈ కొండచిలువ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే పెంచుకుంటారు. దీని ధర భారీగానే ఉంటుంది. ఒక్క పాము రూ.30 లక్షల వరకు ధర పలుకుతోంది.

 

 

New Project (4)

సవానా పిల్లి రూ. 15 లక్షలు

ఆఫ్రికా దేశాల్లో పిల్లులను అధికంగా పెంచుకుంటారు. అమెరికాలో కూడా చాలామంది పిల్లులను తమ ఇంట్లో ఒకరిగా చూసుకుంటారు. అయితే వీటిలో చాలా ఖరీదైన పిల్లి సవానా ఇది పెంపుడు పిల్లికి, ఆఫ్రికా సెర్వల్‌ జాతి పిల్లికి పుట్టింది. సాధారణ పెంపుడు పిల్లి కన్నా కొంచెం ఎత్తుగా, నాజూగ్గా ఉంటుంది. మనుషులతో చాలా స్నేహపూర్వకంగా మెలుగుతాయి. సరదాగా ఉంటాయి. ఇతర పిల్లుల్లా కాకుండా నీటిలో ఆడుకోవడం అంటే వీటికి భలే సరదా. ఎవరూ తోడు లేకపోయినా స్వతంత్రంగా ఆడుకోవడం ఈ పెంపుడు పిల్లులకు అలవాటు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ పిల్లి ధర రూ.15 లక్షలు

 

హ్యాసింత్‌ మకావ్‌ రూ. 10 లక్షలు

రామచిలుక జాతుల్లో ఇదో పెద్ద జాతి. నీలం రంగుతో భలే చూడ ముచ్చటగా ఉంటుంది. దీనిని కొనడమే కాదు.. పెంచడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. ఈ తెలివైన పక్షులకు మంచి నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉంటుంది. దీనికి సౌకర్యవంతమైన గూడు ఏర్పాటు చేయాలి. ఖర్చును తట్టుకుంటే ఇదో మంచి పెంపుడు పక్షిలా ఉంటుంది. సులువుగా దీనికి తర్ఫీదు ఇవ్వవచ్చు. యజమానులతో చాలా ప్రేమగా ఉంటుంది.