Woman Scarf Made with Dogs Fur : పెంపుడు కుక్క‌ల బొచ్చుతో స్కార్ఫ్‌..మెడలో వేసుకుని మురిసిపోతున్న యజమాని

తను ఎంతో ప్రాణంగా పెంచుకునే కుక్కల బొచ్చుతో స్కార్ఫ్ తయారు చేయించుకుని మెడలో వేసుకుని మురిసిపోతోంది యజమానురాలు. ఎందుకో తెలిస్తే శెభాష్ అనాల్సిందే..

Woman Scarf Made with Dogs Fur : పెంపుడు కుక్క‌ల బొచ్చుతో స్కార్ఫ్‌..మెడలో వేసుకుని మురిసిపోతున్న యజమాని

Woman Scarf Made With Dogs Fur

woman Scarf Made with dogs fur : ఉన్నితో తయారు చేసిన జర్కిన్లు, బ్లాంకెట్స్, స్కార్ఫ్స్,మఫ్లర్స్ వంటివి ఎన్నో తయారు చేస్తారనే విషయం తెలిసిందే.ఈ ఉన్నిని కొన్ని రకాల గొర్రెల నుంచి తీసినదే. కానీ.. ఈ మ‌హిళ మాత్రం ఏకంగా.. త‌న పెంపుడు కుక్క‌ల బొచ్చుతో ఓ స్కార్ఫ్‌ను త‌యారు చేయించుకుంది. దాన్ని మెడలో వేసుకుని తెగ మురిసిపోతోంది. గొర్రెల బొచ్చుతో స్కార్ఫ్ లు తయారు చేస్తారు కానీ కుక్కల బొచ్చుతో తయారు చేయించుకోవాలనే ఐడియా మరి ఆమెకు ఎలా వచ్చిందో గానీ..తన పెంపుడు కుక్కల బొచ్చుతో స్కార్ఫ్ తయారు చేయించుకోవటానికి రూ.18 వేలు ఖ‌ర్చు పెట్టింది. మరి ఆమె ఇలా ఎందుకు చేయాలని అనుకుందో తెలిస్తే మాత్రం అస్సలు తిట్టుకోరు పైగా శ‌భాష్ అని కూడా అంటారు.

Reae more : International Dog Day : ప్రతీ కుక్కకు వచ్చిందో రోజు..ఇదే ఆరోజు..

మైకెల్లె పార్క‌ర్ అనే మ‌హిళ‌ రెండు బొచ్చు కుక్క‌ల్ని పెంచుకుంటోంది. అవంటే ఆమెకు ప్రాణం. ఆ కుక్కల్లో ఒక దాని పేరు లుకా, దానికి 4 ఏళ్లు, మరోదాని పేరు కీషోండ్‌దీనికి వ‌య‌సు 12 ఏళ్లు.వాటిని ప్రాణంగా పెంచుకుంటోంది. వాటినికి కూడా యజమాని అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు ఆమె వెనుకే తిరుగుతుంటాయి. ఈక్రమంలో మైకెల్లేకు ఈ కుక్కలకు ఏమన్నా అయి అవి తనకు దూరమైతే..ఆ ఊహే భరించలేకపోయింది. చాలా బాధ పడిపోయింది.

Reae more : International Dog Day : ఈ కుక్కలు వెరీ కాస్ట్లీ గురూ..

ఈ క్రమంలో ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్టును చూసింది. అందులో ఉన్న ఫోటోలో ఓ వ్య‌క్తి కుక్క బొచ్చుతో చేసిన స్కార్ఫ్‌ను వేసుకుని ఉండటం చూసింది. అంతే ఆమెకో ఐడియా వచ్చింది. తన పెంపుడు కుక్కల బొచ్చుతో తాను ఓ స్కార్ఫ్ తయారు చేయించుకోవాలని అనుకుంది.అలా పెంపుడు జంతువుల బొచ్చుతో స్కార్ఫ్‌ను త‌యారు చేసే వాళ్ల‌ను వెతికి ప‌ట్టుకుంది. స్కార్ఫ్ తయారీ కోసం లూకా నుంచి 425 గ్రాముల బొచ్చు,కీషోండ్‌ నుంచి 198 గ్రాముల బొచ్చు తీయించి..త‌న‌కు స్కార్ఫ్ చేయించుకుంది. 18 వేల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టింది. మార్కెట్ లో ఆరేటు పెడితే చాలానే వస్తాయి. కానీ తన కుక్కలతో తనుకున్న అనుబంధం ముఖ్యం అని అనుకున్న ఆమె డబ్బులకు వెనుకాడలేదు.

Reae more : International Dog Day 2021 : ఏనుగుతో పోరాడి..యజమాని కుటుంబాన్ని కాపాడిన కుక్క

ఆ కుక్క‌లు ఎప్పుడూ నాతో ఉండ‌వు క‌దా. ఏదో ఒక‌రోజు న‌న్ను అవి విడిచి వెళ్లిపోతాయి. (బహుశా చనిపోవచ్చు. ఎందుకంటే మనుషులు జీవించినంత కాలం కుక్కలు జీవించవు) అప్పుడు నా ద‌గ్గ‌ర ఉండే వాటి జ్ఞాప‌కం ఇదే.. అందుకే దీన్ని నేను ఎంతో ఇష్టంతో త‌యారు చేయించుకున్నానని ఒకింత ఆనందంగాను.ఒకింత ఉద్వేగంగాను తెలిపింది ఆమె. 2020 క్రిస్‌మ‌స్ వేడుక‌ల్లో మాత్ర‌మే దీన్ని వేసుకున్నా. త‌ర్వాత దీన్ని భ‌ద్రంగా దాచిపెట్టా.. అంటూ మైకెల్లె పార్క‌ర్ చెప్పుకొచ్చింది. బాగుంది కదూ ఆమె ఆలోచన. పెంపుడు జంతువులపై ప్రేమ అటువంటిది మరి..