ఆస్కార్‌కు ఏకగ్రీవంగా ‘గల్లీబోయ్’ మూవీ

బాలీవుడ్ నటుడు రన్ వీర్ సింగ్, అలియా భట్ జోడీగా నటించిన గల్లీబోయ్ మూవీ భారత్ నుంచి ఆస్కార్ అవార్డుకు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో అధికారికంగా చోటు దక్కింది.

  • Published By: sreehari ,Published On : September 21, 2019 / 01:39 PM IST
ఆస్కార్‌కు ఏకగ్రీవంగా ‘గల్లీబోయ్’ మూవీ

బాలీవుడ్ నటుడు రన్ వీర్ సింగ్, అలియా భట్ జోడీగా నటించిన గల్లీబోయ్ మూవీ భారత్ నుంచి ఆస్కార్ అవార్డుకు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో అధికారికంగా చోటు దక్కింది.

బాలీవుడ్ నటుడు రన్ వీర్ సింగ్, అలియా భట్ జోడీగా నటించిన గల్లీబోయ్ మూవీ భారత్ నుంచి ఆస్కార్ అవార్డుకు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో అధికారికంగా చోటు దక్కింది. జోయా అక్తర్ దర్శకత్వంలో రిలీజ్ అయిన గల్లీ బోయ్ మూవీకి 92వ అకాడమీ అవార్డుల్లో చోటు దక్కించుకన్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శనివారం (సెప్టెంబర్ 21, 2019) ఒక ప్రకటనలో వెల్లడించింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా గల్లీ బోయ్ మూవీ కమర్షియల్ రిలీజ్ అయింది. ముంబైలో ర్యాప్ బ్యాండ్ నిర్వహించే గల్లీ గ్యాంగ్ సింగర్లలో రన్ వీర్ సింగ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ‘2019 ఏడాదిలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ ఎంట్రీ లిస్టులో గల్లీ బోయ్ మూవీ అధికారికంగా ఎంపికైంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 27 మూవీలు ఎంపిక కాగా, గల్లీ బోయ్ మూవీ ఏకగ్రీవ నిర్ణయంతో ఎంపిక అయింది’ అని FFI సెక్రటరీ జనరల్ సుప్రాన్ సేన్ తెలిపారు. ఈ ఏడాది సెలక్షన్ కమిటీలో నటులు ఫిల్మ్ మేకర్ అపర్ణ సేన్ జూరీకి అధ్యక్షులుగా ఉన్నారు. గల్లీ బోయ్ మూవీకి రితేశ్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మాతలుగా వ్యవహరించగా రన్ వీర్ సింగ్ హీరోగా నటించాడు. 

గల్లీ బోయ్ మూవీ FFI ఆస్కార్ ఎంట్రీ లిస్టులో ఎంపిక కావడంపై ఫర్హూన్ ట్విట్టర్ వేదికగా చిత్రబృందాన్ని అభినందించారు. ‘92వ ఆస్కార్ అవార్డులకు గల్లీ బోయ్ మూవీ ఇండియా అధికారిక ఎంట్రీ లిస్టులో ఎంపిక అయింది. #apnatimeaayega. ఫిల్మ్ ఫెడరేషన్ వారికి నా కృతజ్ఞతలు.  #Zoya @kagtireema @ritesh_sid @RanveerOfficial @aliaa08 @SiddhantChturvD @kalkikanmani చిత్ర బృందంలోని అందరికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు. ఈ మూవీ ఆస్కార్ అవార్డులకు ఎంపిక కావడం పట్ల పైవోటల్ రోల్ చేసిన కల్కీ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గల్బీ బోయ్ మూవీలో రణ్‌వీర్‌సింగ్, ఆలియా భట్, విజయ్‌రాజ్, కల్కీ కొచ్లిన్, విజయ్ వర్మ తదితరులు నటించారు. 

ఆస్కార్ అవార్డులను ఇప్పటివరకూ ఏ ఇండియన్ ఫిల్మ్ గెలుచుకోలేదు. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఫైనల్ 5లో చివరి ఇండియన్ ఫిల్మ్ గా 2001లో అషుతోష్ గౌరికర్ నిర్మించిన లగాన్ మూవీ మాత్రమే ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. మదర్ ఇండియా (1958), సలామ్ బాంబ్వే (1989), మిగిలిన రెండు ఇండియన్ మూవీలు టాప్ ఐదు స్థానాల్లో నిలిచాయి. ఫిబ్రవరి 9, 2020లో 92వ అకాడమీ అవార్డుల్లో ప్రకటించనున్నారు.