కోహ్లీ చెప్పిన ఆ సీక్రెట్ బైటపెట్టిన సిరాజ్.. కొత్తబంతి ఇచ్చేముందు విరాట్ ఏమన్నాడంటే?

  • Published By: sreehari ,Published On : October 22, 2020 / 03:21 PM IST
కోహ్లీ చెప్పిన ఆ సీక్రెట్ బైటపెట్టిన సిరాజ్.. కొత్తబంతి ఇచ్చేముందు విరాట్ ఏమన్నాడంటే?

Mohammed Siraj : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్.. కొత్త బంతితో అద్భుతమైన బౌలింగ్‌ చేసి వార్తల్లో నిలిచాడు.. నాలుగు ఓవర్లలో (3/8) మూడు వికెట్లు పడగొట్టి కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ వెన్నువిరిచాడు.



ఐపీఎల్‌లో ఒక బౌలర్‌ 2 మెయిడిన్లు వేసిన తొలి బౌలర్ గా అవతరించాడు. చక్కటి స్పెల్‌తో కోల్ కతాను మట్టికరిపించిన క్రెడిట్ కేవలం సిరాజ్ కు మాత్రమే కాదు.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా చెందుతుంది. ఎందుకంటే.. కొత్త బంతిని వేయమని సిరాజ్ కు అవకాశమిచ్చింది కోహ్లీనే..



అంతేకాదు.. కొత్త బంతి ఇచ్చే ముందు కోహ్లీ తనకు చెప్పిన సీక్రెట్ ఏంటో సిరాజ్ మ్యాచ్ అనంతరం రివీల్ చేశాడు. తాను కొత్తబంతిని పంచుకోవడం సిరాజ్‌కు ఇదే తొలిసారి. అయినప్పటికీ కేకేఆర్‌తో మ్యాచ్‌లో కొత్త బంతిని ఎలా ప్రదర్శించాలో కోహ్లీనే తనకు చెప్పాడని అన్నాడు.



‘నా ప్రదర్శన పట్ల ముందుగా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కొత్త బంతితో బౌలింగ్‌ చేసే అవకాశం ఇచ్చిన కోహ్లికి కృతజ్ఞతలు. మేం మైదానంలోకి వెళ్లినప్పుడు నేనేమి అనుకోలేదు. కానీ సిద్ధంగా ఉండు అని విరాట్‌ చెప్పాడు. కొత్త బంతితో నేను చాలా సాధన చేస్తున్నాను. అది ఇక్కడ పని చేసింది. రాణాను అవుట్‌ చేసిన బంతి చాలా బాగా పడింది’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.



కొత్తబంతిని ఎలా బౌలింగ్ చేయాలో అలానే ప్రయోగించాడు. సిరాజ్ కు కొత్త బంతిని ఇచ్చి చాలా కాలమైంది. ఎందుకంటే అతడిది హై ఎకానమీ రన్ రేటు ఉండటమే.. రాకరాక వచ్చిన అవకాశమే.. ఎలా వదులుకుంటాడు మన హైదరాబాదీ.. 26ఏళ్ల సిరాజ్ దాన్ని వ్యర్థం చేయాలనుకోలేదు.



కోహ్లీ చెప్పినట్టుగానే కొత్తబంతిని ప్రయోగించాడు.. అనుకున్నట్టుగానే బంతి అలాగే పడింది. మూడు వికెట్లు పడగొట్టి కోల్ కతా పతనాన్ని శాసించాడు. ఫలితంగా బెంగళూరు విజయానికి బాటలు వేశాడు.