IPL Players Arm Tattoos: క్రికెటర్ల టాటూ క్రేజ్.. చేతులపై పచ్చబొట్లు గల 8మంది ఐపీఎల్ ఆటగాళ్లు వీరే!

పచ్చబొట్టు చెరిగిపోదులే నారాజా.. పడచు జంట చెదిరిపోదులే నా రాణీ.. అంటూ మన సినీ కవులు అప్పుడెప్పుడో రాసుకొచ్చారంటే.. పచ్చబొట్టు మన సమాజంలో అనాదిగా వస్తున్న ఓ సంస్కృతి అని మరోలా చెప్పుకోవాల్సిన పనిలేదు. కాకపోతే అప్పటి పచ్చబొట్టే ఇప్పుడు టాటూలుగా మారి త్రీడీలో ఏ డిజైన్ కావాలో.. ఏ ఆకారం కావాలన్నా మన దేహం మీద పడిపోతుంది.

IPL Players Arm Tattoos: క్రికెటర్ల టాటూ క్రేజ్.. చేతులపై పచ్చబొట్లు గల 8మంది ఐపీఎల్ ఆటగాళ్లు వీరే!

Ipl Players Arm Tattoos Tattoo Craze Of Cricketers Here Are 8 Ipl Players With Tattoos On Their Hands

IPL Players Arm Tattoos: పచ్చబొట్టు చెరిగిపోదులే నారాజా.. పడచు జంట చెదిరిపోదులే నా రాణీ.. అంటూ మన సినీ కవులు అప్పుడెప్పుడో రాసుకొచ్చారంటే.. పచ్చబొట్టు మన సమాజంలో అనాదిగా వస్తున్న ఓ సంస్కృతి అని మరోలా చెప్పుకోవాల్సిన పనిలేదు. కాకపోతే అప్పటి పచ్చబొట్టే ఇప్పుడు టాటూలుగా మారి త్రీడీలో ఏ డిజైన్ కావాలో.. ఏ ఆకారం కావాలన్నా మన దేహం మీద పడిపోతుంది. ప్రపంచంలోని ఏ భాషలో అయినా టాటూలకు అవకాశం ఉండగా వీటి మీద మన సెలబ్రిటీలకుంటే మోజు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా క్రికెటర్లలో ఎక్కువ మంది వారి బాడీలో రరకాల చోట ఈ టాటూలు వేయించుకుంటుంటారు.

పచ్చబొట్లు ఉన్న మన ఇండియన్ క్రికెటర్ల గురించి ఆలోచన రాగానే మనకు గుర్తుకు వచ్చే మొదటి పేరు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. విరాట్ తన జీవితంలో ముఖ్యమైన క్షణాలు, అతని రాశిచక్రంతో పాటు ఇతర ముఖ్యమైన వ్యక్తీకరణలు అతని బాడీఫై శాశ్వతంగా టాటూగా కనిపిస్తాయి. కోహ్లీ మాత్రమే కాదు సూర్యకుమార్ యాదవ్ నుండి శిఖర్ ధావన్ వరకు చాలామంది ఒంటిమీద ఈ టాటూలను మనం చూడొచ్చు. త్వరలోనే ఐపీఎల్ సీజన్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సీజన్ ఐపిఎల్‌లో పాల్గొనే ఆటగాళ్ళలో అద్భుతమైన పచ్చబొట్లు కలిగిన ఎనిమిది మంది ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Virat Kohli

Virat Kohli

Virat Kohli

విరాట్ కోహ్లీ టాటూల గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా తన చేతుల చుట్టూ డిజన్ చేయించుకున్న వీటితో అతని జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు దాగి ఉన్నాయి. మొత్తం 11 టాటూలు గల విరాట్ రాశిచక్రం, తల్లిదండ్రుల పేర్లు, అతని వన్డే నంబర్, ఒక మఠం, శివుడు ఇలా ఒక్కొకటి ఒక్కో అంశాన్ని సూచిస్తాయి. విరాట్ టాటూలలో అతని ఎడమ కండరాలపై ఉండే బోల్డ్, క్లిష్టమైన డిజైన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒకవిధంగా ఆ టాటూ తన లక్షణాలను సూచిస్తుందని కోహ్లీ చెప్పుకుంటాడు.

2. Surya Kumar Yadav

Surya Kumar Yadav

Surya Kumar Yadav

బ్యాట్స్ మాన్ సూర్య కుమార్ యాదవ్ పూర్తిగా తన ఎడమ చేతి మొత్తాన్ని కవర్ చేసేలా ఉండే టాటూతో సహా మొత్తం 18 పచ్చబొట్లు కలిగి ఉన్నాడు. ఇందులో అతని తల్లిదండ్రుల పేర్లు, ఎడమ చేతిని కవర్ చేసేలా ఉండే టాటూలు రెండు ఈ ముంబై క్రికెటర్‌కు అతి ముఖ్యమైనవి చెప్తాడు. ఇక తన బాడీలో చాలా టాటూలు ఉన్నప్పటికీ చేతి నుండి ఛాతి వరకు ఉండే టాటూ దానిలో దాగి ఉన్న పదాలు, అజ్టెక్ డిజైన్ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.

3. Ben Stokes

Ben Stokes

Ben Stokes

ఇంగ్లీష్ బ్యాట్స్ మాన్ బెన్ స్టోక్స్ ఆట మాదిరే అతని శరీరంపై పచ్చబొట్లు కూడా భారీగానే ఉంటాయి. బెన్ స్టోక్స్ వెనుక ఉండే పెద్ద పచ్చబొట్టు తన శరీరంపై డిజన్ చేయడానికే 28 గంటలు పట్టిందంటే అర్ధం చేసుకోవచ్చు అది ఏ రేంజ్ లో ఉంటుందో. ఇక అది కాకుండా సింహం, మరో ఆడ సింహం రెండు పిల్లలతో కలిసి ఉండే డిజైన్ అతని భార్య, అతని ఇద్దరు పిల్లలకు ప్రతీకగా డిజైన్ చేయించుకోగా ఇదే ఆయనకు అత్యంత ఇష్టమైన టాటూ.

4. Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya

పాండ్యా అల్ రౌండర్ గా గ్రౌండ్ లో ఎలా అదరగొట్టగలడో.. అతని టాటూలలో కూడా అంతే పవర్ ఫుల్ డిజైన్స్ ఇష్టపడతాడు. మిగతా వారిలాగానే తన జీవితంలో ముఖ్య ఘట్టాలను తన శరీరంఫై టాటూ చేయించుకున్న పాండ్య అతని చేతిపై ఉన్న సింహం టాటూ అతన్ని ప్రత్యేకంగా ప్రజెంట్ చేస్తుంది.

5. Chris Gayle

Chris Gayle

Chris Gayle

బెన్ స్టోక్స్ తన వెనుక భాగంలో సింహం కుటుంబాన్ని డిజైన్ చేయించుకుంటే వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ జమైకాలో విశాలమైన బంగ్లాలో నివసిస్తున్న అలోహాను క్రిస్ గేల్ అతని ఛాతీపై డిజైన్ చేయించుకున్నాడు.

6. Yuzvendra Chahal

Yuzvendra Chahal

Yuzvendra Chahal

యుజ్వేంద్ర చాహల్ ఓ ఇంటర్వ్యూలో షర్ట్‌లెస్‌ ఫోజులిచ్చాడు. దీన్ని బట్టి చూస్తే అతని ఛాతీపై నుండి చేతి వరకు ఓ సింహం టాటూ స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తుంది.

7. KL Rahul

Kl Rahul

Kl Rahul

కె.ఎల్.రాహుల్‌ బాడీపై ఉండే ప్రతి టాటూ ఎంతో ప్రత్యేకమైనదే. అతని చేతిపై ఉండే టాటూ.. లోపలి బైసప్ మీద ఉండే వాటికి ప్రత్యేక లక్షణం ఉంటుంది. క్లాక్, లైట్హౌస్ డిజైన్ లో ఉండే ఇవి టైం 11ను తాకినప్పుడు అతని పుట్టిన సమయాన్ని గుర్తు చేస్తే లైట్హౌస్ ఇంటిని గుర్తు చేస్తుంది. అతని పెంపుడు కుక్క డిజైన్ బాడీ వెనుక భాగంలో ఉండగా ఈ టాటూ అంటే రాహుల్ కు ఎంతో ఇష్టమట.

8. Shikhar Dhawan

Shikhar Dhawan

Shikhar Dhawan

శిఖర్ ధావన్ ఆటలో రెండు విషయాలను ఇష్టపడతాడు. ఒకటి స్క్వేర్ కట్, రెండు ఆన్-ఫీల్డ్. ధావన్ టాటూలు కూడా తన ఆట మాదిరే వైవిధ్యంగా ఉంటాయి. అతని శరీరం అంతటా ఉండే టాటూలలో ధావన్ తన ఎడమ చేతిపై పక్షిని కలిగి ఉన్న ఖాళీ చెట్టు డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.