గుడ్ న్యూస్… తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11,000 ఉద్యోగాలు

  • Published By: Chandu 10tv ,Published On : September 11, 2020 / 05:49 PM IST
గుడ్ న్యూస్… తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11,000 ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలోని గవెర్నమెంట్ హాస్పిటల్స్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 11,000 పోస్టుల్ని భర్తీ భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.



ఇప్పటికే 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ హాస్పిటల్స్ కు 10 వేల పోస్టులు అవసరం. అందులో 4000 పోస్టుల్ని భర్తీ చేశామని మరో 6000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. ఈ 54 ఆస్పత్రుల్లో 6000 పోస్టులతో పాటు మరో 5000 పోస్టుల్ని ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో మొత్తం 11,000 ఖాళీలు భర్తీ కానున్నాయి.

వైద్య ఆరోగ్య శాఖ భర్తీ చేసే పోస్టుల్లో డాక్టర్, స్పెషలిస్ట్ పోస్టులతో పాటు నర్సింగ్ పోస్టులు ఉండే అవకాశముంది. త్వరలోనే 11,000 పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది.