Shocking News : వాషింగ్‌ మెషిన్‌లో పడ్డ బుడ్డోడు..పావుగంట తరువాత ప్రాణాలతో బయటపడ్డ ఏడాది పిల్లాడు

వాషింగ్‌ మెషిన్‌లో పడిపోయాడు ఏడాదిన్న పిల్లాడు. పావుగంటసేపు సబ్బునీటిలో బట్టలతో మిషన్ లో తిరిగాడు. పావుగంట తరువాత ప్రాణాలతో బయటపడ్డాడు.

Shocking News : వాషింగ్‌ మెషిన్‌లో పడ్డ బుడ్డోడు..పావుగంట తరువాత ప్రాణాలతో బయటపడ్డ ఏడాది పిల్లాడు

boy washed for 15 min in washing machine

boy washed for 15 min in washing machine : వాషింగ్ మిషన్ లో పడ్డ ఏడాది బుడ్డోడు 15 నిమిషాల పాటు బట్టలతో పాటు మిషన్ లో సబ్బునీటిలో  గిరగిరా తిరిగాడు. టాప్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషిన్‌లో బట్టలు వేసి స్విచ్ ఆన్ చేసిన తల్లి కాసేపటికి పిల్లాడు కనిపించకపోవటం కంగారుపడిపోయింది. ఇల్లాంతా వెదికింది.ఇంటి బయట కూడా వెదికింది. కానీ ఎక్కడా కనిపింలేదు. ఏడాదిన్నర పిల్లాడు ఇల్లు దాటి ఎక్కడికి పోతాడు? అనుకుంటూనే మరోసారి ఇల్లాంతా వెదికింది. కానీ ఎక్కడా కనిపించలేదు.దీంతో కంగారుపడిపోయిందా తల్లి. కాళ్లూ చేతులు ఆడలేదు. గండె దడదడలాడిపోతుండగా మనస్సులో మెదిలిన అనుమానంతో భయపడిపోతూనే వాషింగ్ మిషన్ స్విచ్ ఆఫ్ చేసిన టాప్ ఓపెన్ చేసి చూసింది. అంతే..!! గుండెలు అదిరిపోయాయి. వాషింగ్ మిషన్ లో ఉన్న పిల్లాడిని చూసిన ఆమె హడలిపోయింది. గబగబా బయటకు తీసింది. దేవుడా అనుకుంది పిల్లాడు ప్రాణాలతోనే ఉండటంతో..అంతే బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని హాస్పిటల్ కు పరుగు పెట్టింది. కానీ ప్రాణాలతో పోరాడి బయటపడ్డాడు.

ఢిల్లీలో జరిగిన ఈ ఘటనతో చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాషింగ్ మిషన్ వాడకంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరిస్తోంది. ఢిల్లీకి చెందిన మహిళ ఇంట్లోని ఓ గదిలో ఉన్న టాప్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషిన్‌లో బట్టలు వేసి ఆన్‌ చేసి వెళ్లింది. ఆమెకు ఏడాదిన్నర బాబు గదిలో బాబు కనిపించలేదు. 15 నిమిషాల తర్వాత వాషింగ్‌ మెషీన్‌లో కనిపించాడు. అంతే వెంటనే వసంత్‌కుంజ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్లకు విషయం చెప్పింది. వెంటనే చికిత్స ప్రారంభించారు. అప్పటకే నీలి రంగులోకి మారిపోయి స్పృహ తప్పిపోయాడు. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది.

కానీ డాక్టర్లు అత్యవసర చికిత్స అందించటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పిల్లాడి పరిస్థితి గురించి పిల్లల వైద్య నిపుణురాలు హిమాన్షి జోషి మాట్లాడుతూ..తల్లి బిడ్డను తీసుకొచ్చేసరికే నీలం రంగులోకి మారిపోయాడని స్పృహ తప్పిపోయాడని..పలు అవయవాలు అవయవాలు పని చేయడం మానేశాయని తెలిపారు. న్యుమోనియాతో పాటు జీర్ణకోశ ఇన్ఫెక్షన్ సైతం సోకిందని తెలిపారు.

12 రోజులపాటు బాబు కోమాలోకి వెళ్లాడని, వెంటిలేటర్‌పై ఉంచి యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్ సపోర్టుతో క్రమంగా కోలుకున్నాడని తెలిపారు. అలా వారంరోజుల తరువాత తల్లిని గుర్తుపట్టాడని తెలిపారు. బాబు మెదడు పనితీరు గురించి ఆలోచించి స్కానింగ్ చేయగా ఎటువంటిసమస్యల లేదని తెలుసుకున్నామని తెలిపారు.ప్రస్తుతం నానగ క్రమంగా కోలుకుంటున్నాడని వివరించారు. కాగా కుర్చీ సహాయంతో పైకి ఎక్కి వాషింగ్ మిషన్ లో పడిపోయాడని భావించింది ఆ తల్లి.