పెళ్లికొచ్చినా..పేరంటానికి వచ్చినా..క్వారంటైన్ కు తరలిస్తాం

  • Published By: madhu ,Published On : May 16, 2020 / 04:35 AM IST
పెళ్లికొచ్చినా..పేరంటానికి వచ్చినా..క్వారంటైన్ కు తరలిస్తాం

కరోనా వైరస్ విస్తరిస్తోంది…లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి.. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతోంది..ఎక్కువగా గుమి కూడవద్దు..ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో..వివాహాలు తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని..చేసుకున్నా..నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా..కొంతమంది బేఖాతర్ చేస్తున్నారు. దీని కారణంగా వైరస్ మరింత విస్తరిస్తోంది. నిబంధనలు పాటించకుండా పెళ్లిళ్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లికి హాజరైన వారికి క్వారంటైన్ కు తరలించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

బళ్లారి తాలుకాలోని అమరాపుర గ్రామంలో వివాహం జరుగుతోంది. ఈ పెళ్లికి బంధువులు, ఇతరులు హాజరయ్యారు. పొరుగున్న ఉన్న ఏపీ రాష్ట్రం నుంచి కూడా కొంతమంది ఇక్కడకు వచ్చారు. ఈ విషయం 2020, మే 14వ తేదీ గురువారం రాత్రి అధికారులకు తెలిసిందే. వెంటనే పెళ్లి జరుగుతున్న ప్రాంతం వద్దకు చేరుకున్నారు. వివాహానికి అనుమతి తీసుకోలేదని నిర్ధారించారు. టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేశాయి. 

పెళ్లి కోసం వచ్చిన..అనంతపురం జిల్లాకు చెందిన 11 మందిని క్వారంటైన్ కు తరలించారు. ఇందులో వధూవరులు కూడా ఉన్నారు. దీంతో పెళ్లి వేడుక కాస్తా బోసిపోయింది. మరోవైపు కరోనా కట్టడికి బళ్లారి వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…ఆయా జిల్లాల నుంచి బళ్లారిలోకి రాకుండా..చెక్ పోస్టులపై నిఘా మరింత పెంచారు. 

Read Here>> సూట్‌కేసుపై చిన్నారిని మోసుకెళ్తున్న వలస కార్మికురాలు.. పరిస్థితిపై NHRC విచారణ