Smart phone : స్మార్ట్ ఫోన్ కొనటానికి రక్తం అమ్మాకానికి పెట్టిన బాలిక

స్మార్ట్ ఫోన్ కొనటానికి రక్తం అమ్మాకానికి పెట్టింది ఓ బాలిక.

Smart phone : స్మార్ట్ ఫోన్ కొనటానికి రక్తం అమ్మాకానికి పెట్టిన బాలిక

Girl wants to sell blood to buy a smart phone

Girl wants to sell blood to buy a smart phone : ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే. లాక్ డౌన్ సమయంలో స్మార్ట్ ఫోన్లతోనే చదువులు సాగాయి. అటువంటి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని చాలామందికి ఉంటుంది. అటువంటి కోరికే ఓ బాలికను ఏకంగా రక్తం అమ్మానికి పెట్టటానికి సిద్ధపడేలా చేసింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవటానికి ఏకంగా తన రక్తం అమ్మటానికి హాస్పిటల్ కు వచ్చింది ఓ 16 ఏళ్ల బాలిక. ఇంటర్ చదివే అమ్మాయి రక్తం అమ్మటానికి వచ్చేసరికి హాస్పిటల్ వారికి అనుమానం వచ్చి ఆరా తీయటంతో అసలు విషయం బటయపడింది.

బెంగాల్‌లోని దినాజ్‌పూర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. ఆమెకు కొనుక్కోవాలనకుంది. ఇంట్లో అడిగితే డబ్బులు ఇవ్వరని భావించింది. దీంతో ఆన్‌లైన్‌లో రూ. 9 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేసింది. నాలుగు రోజుల్లో ఫోన్ డెలివరీ వస్తుంది. కానీ ఆమె దగ్గర అంత డబ్బు లేదు. దీంతో రక్తం అమ్మి డబ్బులు తీసుకోవాలనుకుంది. దీని కోసం ట్యూషన్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బలూర్‌ఘాట్‌లోని జిల్లా ఆసుపత్రికి వచ్చింది. రక్తం అమ్ముతాను డబ్బులు ఇవ్వాలని కోరింది.

హాస్పిటల్ లో ఉన్న బ్లడ్ సెంటర్ కి వెళ్లి రక్తం ఇస్తాను డబ్బులు కావాలని అడిగింది. అది విన్న అక్కడి సిబ్బంది షాకయ్యారు. అనుమానం వచ్చింది. బ్లడ్ సెంటర్ సిబ్బంది శిశు సంక్షేమ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి విషయం అడిగేసరికి. నా సోదరుడికి ఒంట్లో బాగాలేదు..చికిత్స కోసం డబ్బుల కావాలి..అవి మా దగ్గర లేవు. అందుకే రక్తం అమ్మాలనుకున్నానని చెప్పింది. కానీ వారికి నమ్మకం కుదర్లేదు. మీ ఇంటి అడ్రస్ చెప్పు..మీ ఇంట్లో వాళ్లను కూడా అడిగాక నువ్వు చెప్పేది నిజమో అబద్దమో తెలుసుకోవాలని అడిగేసరికి అసలు విషయం బయటపెట్టింది. దీంతో సదరు బాలికను మందలించిన సిబ్బంది.. జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.