Asian Film Awards : ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ నామినేషన్స్ లో RRR, పొన్నియిన్ సెల్వన్ 1..

16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ ఈవెంట్ మార్చి 12న హాంకాంగ్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఈ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ నామినేషన్స్ లో నిలిచిన సినిమాలని ప్రకటించారు. నామినేషన్స్ లో భారతదేశం నుంచి........

Asian Film Awards : ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ నామినేషన్స్ లో RRR, పొన్నియిన్ సెల్వన్ 1..

16th Asian Film Awards nominations from India

Updated On : January 7, 2023 / 10:40 AM IST

Asian Film Awards :  16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ ఈవెంట్ మార్చి 12న హాంకాంగ్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఈ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ నామినేషన్స్ లో నిలిచిన సినిమాలని ప్రకటించారు. ఆసియా ఖండంలోని అన్ని దేశాల నుంచి వచ్చిన సినిమాలని పరిశీలించి వివిధ విభాగాల్లో నామినేషన్స్ ని ప్రకటించారు. ఈ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ నామినేషన్స్ లో భారతదేశం నుంచి పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా 6 విభాగాల్లో, RRR సినిమా 2 విభాగాల్లో నామినేట్ అయ్యాయి.

మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్.. ఇలా చాలామంది స్టార్స్ తో తెరకెక్కిన తమిళ సినిమా పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఓ తమిళ నవల ఆధారంగా తమిళ చరిత్రకి దగ్గరగా ఉండేలా తెరకెక్కించారు ఈ సినిమాని. ఈ సినిమా పార్ట్ 1 ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్‌గా శ్రీకర్ ప్రసాద్, ఉత్తమ సినిమాటోగ్రఫీగా రవి వర్మన్, ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్‌గా ఎ.ఆర్. రెహమాన్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌గా తోట తరణి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ గా ఏకా లఖాని నామినేట్ అయ్యారు.

Gautami : వెబ్‌సిరీస్‌లకు కూడా సెన్సార్ అవసరం.. నటి గౌతమి వ్యాఖ్యలు..

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్- శ్రీనివాస్ మోహన్, ఉత్తమ సౌండ్- అశ్విన్ రాజశేఖర్ విభాగాల్లో మాత్రమే నామినేట‍్ అవ్వడం గమనార్హం. ఆసియా దేశాల్లో పొన్నియిన్ సెల్వన్ కంటే కూడా RRR సినిమాకి విపరీతమైన స్పందన లభించింది. అయినా కేవలం ఆ రెండు విభాగాల్లో మాత్రమే నామినేట్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.