Gautami : వెబ్‌సిరీస్‌లకు కూడా సెన్సార్ అవసరం.. నటి గౌతమి వ్యాఖ్యలు..

తాజాగా నటి, కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ గౌతమి వెబ్ సిరీస్ లపై సెన్సార్ గురించి వ్యాఖ్యలు చేసింది. గౌతమి మాట్లాడుతూ.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. సినిమాలకి ఉన్నట్టు సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో సిరీస్ లలో హింసాత్మక సంఘటనలు, అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా........

Gautami : వెబ్‌సిరీస్‌లకు కూడా సెన్సార్ అవసరం.. నటి గౌతమి వ్యాఖ్యలు..

actress Gautami comments on sensor rules on web series

Gautami :  ఒకప్పటి హీరోయిన్ గౌతమి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తుంది. అలాగే ఆమె సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ గా కూడా ఉంది. ఇటీవల గౌతమి ఆఫ్ థింగ్స్ అనే ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ శుక్రవారం నుంచి సోని లివ్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది గౌతమి.

సినిమాల్లో వచ్చే అధిక వయోలెన్స్, మితిమీరిన రొమాన్స్ సన్నివేశాలని కంట్రోల్ లో ఉంచడానికి సెన్సార్ బోర్డు ఉంది. అయితే ఇటీవల వెబ్ సిరీస్ లలో ఈ సన్నివేశాలు అధికంగా ఉంటున్నాయి. చాలా వరకు ప్రతి వెబ్ సిరీస్ లోనూ సెక్సువల్, వయోలెన్స్ కంటెంట్ ఉంటుంది. సిరీస్ లకి సెన్సార్ బోర్డు లేకపోవడంతో కొంతమంది వీటిని శృతిమించి మరీ చూపిస్తున్నారు. దీంతో గత కొన్ని రోజుల నుంచి పలువురు వెబ్ సిరీస్ లకి కూడా సెన్సార్ బోర్డు ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

Shruthi Haasan : ఆయన టాలీవుడ్ లో నాకు అన్నయ్య లాంటివాడు..

తాజాగా నటి, కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ గౌతమి వెబ్ సిరీస్ లపై సెన్సార్ గురించి వ్యాఖ్యలు చేసింది. గౌతమి మాట్లాడుతూ.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. సినిమాలకి ఉన్నట్టు సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో సిరీస్ లలో హింసాత్మక సంఘటనలు, అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొంతమంది హద్దు మీరు మరీ అలాంటి సన్నివేశాలని జొప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో కచ్చితంగా వెబ్ సిరీస్ లకి సెన్సార్ బోర్డు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. మరి భవిష్యత్తులో వెబ్ సిరీస్ లకి కూడా సెన్సార్ నిబంధనలు వర్తిస్తాయేమో చూడాలి.