Kashmiri Pandit teachers: కేంద్రం కీలక నిర్ణయం.. అక్కడ పనిచేసే 177 మంది టీచర్ల బదిలీ..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్దిరోజులుగా తమను ఇక్కడి నుండి బదిలీ చేయాలంటూ కాశ్మీర్ పండింట్ ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్లకు కేంద్ర అంగీకారం తెలిపింది. దీంతో శ్రీనగర్ లో విధులు నిర్వహిస్తున్న 117మంది పండిట్ టీచర్లను

Kashmiri Pandit teachers: కేంద్రం కీలక నిర్ణయం.. అక్కడ పనిచేసే 177 మంది టీచర్ల బదిలీ..

Kashmiri Pandit

Kashmiri Pandit teachers: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్దిరోజులుగా తమను ఇక్కడి నుండి బదిలీ చేయాలంటూ కాశ్మీర్ పండింట్ ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్లకు కేంద్ర అంగీకారం తెలిపింది. దీంతో శ్రీనగర్ లో విధులు నిర్వహిస్తున్న 117మంది పండిట్ టీచర్లను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జమ్మూ కశ్మీర్ లో గత కొన్ని రోజులుగా అల్పసంఖ్యాక వర్గాల వారిపై ఉగ్రదాడులు జరుగుతున్నాయి. వరుస హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీరీ పండితుల్లో భయాందోళన మొదలైంది. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న కశ్మీరీ పండితులు మమ్మల్ని ఇక్కడి నుండి బదిలీ చేయాలంటూ కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

Kashmiri Pandits: కాశ్మీరీ పండిట్లని బంధించడం న్యాయమా: కేజ్రీవాల్

ఈ క్రమంలో శుక్రవారం హోం మంత్రి అమిత్ షా ఆర్మీ చీఫ్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన మరుసటి రోజే టీచర్ల బదిలీపై ఉత్తర్వులు వెలువడ్డాయి. 1990లో కశ్మీర్ లోయ వదిలి వెళ్లిన వారిని తిరిగి స్వస్థలాలకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం విధితమే. ప్రధాన మంత్రి ప్రత్యేక పునరావాస ప్యాకేజీ కింద వేలాది మందికి ఎస్సీ కోటాలో ఉద్యోగాలిచ్చి కశ్మీర్ లోయలో నియమించింది.

Kashmiri Pandit: తీవ్రవాదుల దాడిలో కశ్మీర్ పండిట్ మృతి

వీరికి ఆర్థిక ప్యాకేజీలు కూడా ప్రకటించింది. దీంతో చాలా మంది తిరిగి కశ్మీర్ లోయకు వచ్చి ఉద్యోగులు చేస్తున్నారు. తాజాగా వరుస దాడులు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో తిరిగి తమను వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 177 మందిని కశ్మీర్ లోయ నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది.