ఇలా చేయగలరా : కోడిగుడ్లను ఎలా పేర్చాడో చూడండి

  • Published By: madhu ,Published On : June 19, 2020 / 08:42 AM IST
ఇలా చేయగలరా : కోడిగుడ్లను ఎలా పేర్చాడో చూడండి

కోడి గుడ్డుపై మరొక..కోడి గుడ్డు ఇలా ఒకదానిపై ఒకటి పెట్టి పేరుస్తారా ? ఏంటీ పేర్చేది..గుడ్డు కింది భాగం ఎలా ఉంటుంది..అదీ..దానిపై మరొకటి పెట్టడమా ఇంపాజబుల్. అంటారు కదా..కానీ ఓ వ్యక్తి ఏకంగా..మూడు కోడి గుడ్లు పేర్చి ఇట్స్ పాజబుల్ అంటున్నాడు. ఓపికతో పెట్టిన ఈ వ్యక్తిపై పలువురు శభాష్ అంటూ కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. 

మలేషియాలోని కౌలాలంపూర్ కు చెందిన 20 ఏండ్ల మహ్మద్ ముక్బెల్ మూడు గుడ్లను వరుసగా పేర్చాడు. ఒకదానిపై ఒకటి చక్కగా పేర్చాడు. ఇలా మూడు గుడ్లను ఐదు సెకండ్ల పాటు..గుడ్లు కింద పడకుండా…పేర్చిన ఈ యువకుడి ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే..దీనిపై కొంతమంది గుడ్లు తాజాగా ఉంటేనే..ఇలా చేయగలరని అంటున్నారు. ఇదొక గిన్నిస్ రికార్డు అంటున్నారు. ఏది ఏమైనా…ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టిస్ చేశాడో అంటున్నారు కొంతమంది నెటిజన్లు. 

 

Read: చైనా ఫుడ్ ను బహిష్కరించాలి..ఆ రెస్టారెంట్లను బ్యాన్ చేయాలి : కేంద్రమంత్రి పిలుపు