2020: టాప్ 10 సౌత్ ఇండియన్ మూవీస్ ఇవే..

  • Published By: sekhar ,Published On : December 14, 2020 / 02:57 PM IST
2020: టాప్ 10 సౌత్ ఇండియన్ మూవీస్ ఇవే..

2020 Most Tweeted Movies: సినిమా ప్రమోషన్ విషయంలో సోషల్ మీడియా పబ్లిసిటీ కూడా ఓ భాగమైపోయింది. సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గరినుండి గుమ్మడికాయ కొట్టే వరకు.. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గరి నుండి సినిమా రిలీజ్ వరకు.. కలెక్షన్లు, రికార్డులు.. ఇలా ప్రతి ఒక్కటి ఆయా సినిమాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్లతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంటాయి..

ఈ ట్రెండింగ్ విషయంలో మేకర్స్ కంటే స్టార్ హీరోల ఫ్యాన్సే బాగా హుషారుగా ఉంటారు. మిలియన్ల కొద్దీ ట్వీట్స్, ట్రెండింగ్ ప్లేసెస్ వంటివి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ, అప్‌డేట్ చేస్తుంటారు. తాజాగా 2020 Most Tweeted Top 10 Movies లిస్ట్ బయటకొచ్చింది.

ఈ లిస్టులో దళపతి విజయ్ ‘మాస్టర్’, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, తల అజిత్ ‘వలిమై’, సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, సూర్య ‘శూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా), ఎన్టీఆర్- రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’, ‘సరిలేరు నీకెవ్వరు’, యష్ ‘కె.జి.యఫ్. చాప్టర్ 2’, తలైవా రజినీకాంత్ ‘దర్బార్’ మూవీస్ ఉన్నాయి.

2020 Most Tweeted Top 10 Movies