US Open Women : చరిత్ర సృష్టించిన ఎమ్మా రాడుకాను

యూఎస్‌ ఓపెన్‌లో ఇంగ్లాండ్‌ యువ టెన్నిస్‌ క్రీడాకారిణి  ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించారు.

US Open Women : చరిత్ర సృష్టించిన ఎమ్మా రాడుకాను

Us

Emma Raducanu : యూఎస్‌ ఓపెన్‌లో ఇంగ్లాండ్‌ యువ టెన్నిస్‌ క్రీడాకారిణి  ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన 18ఏళ్ల ఎమ్మా కెనడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్ ను మట్టికరిపించారు.. 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకున్నారు. దీంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్ గా రదుకా చరిత్ర సృష్టించారు. 150వ ర్యాంకులో ఎమ్మా కొనసాగుతుండగా…లెలా ఫెర్నాండెజ్ 73వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

Read More : Sign On Bond Paper : ప్రియుడితో బాండ్ పేపర్ పై సంతకం చేయించుకున్న ప్రియురాలు

మ్యాచ్ విషయానికి వస్తే..తొలి నుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శిచారు ఎమ్మా. ఎక్కడా తప్పు చేయకుండా…మొదటి సెట్ ను 6-4 తేడాతో గెలుపొందారు. అదే ఊపును రెండో సెట్ లో కూడా కొనసాగించారు. ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ…6-3 తేడాతో రెండో సెట్ కైవసం చేసుకుని…తొలి గ్రాండ్ స్లమ్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు ఎమ్మా. 2.5 మిలియన్ డాలర్ల ఫ్రైజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ గెలుపుతో 150వ ర్యాంకులో ఉన్న ఎమ్మా…ఏకంగా 23వ ర్యాంకుకు చేరుకున్నారు.

Read More : Coronavirus : కేరళలో 20,487 కొత్త కేసులు, 181 మరణాలు

సెమీఫైనల్స్‌లో ఆమె మారియా సక్కారీపై వరుస సెట్లలో విజయం సాధించింది. దీంతో ఉమెన్స్‌ సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన అతి చిన్న వయస్కురాలిగా ఎమ్మా రాడుకాను రికార్డు సృష్టించింది. 17 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన పిన్న వయస్కురాలి గానూ ఎమ్మా రికార్డు నెలకొల్పింది. 1999లో 17 ఏళ్ల సెరీనా విలియమ్స్‌ 18 ఏళ్ల క్రీడాకారిణి మార్టినా హింగిస్‌ను ఓడించింది.