21 years Sri Ram : 21 ఏళ్ల వయసులో శ్రీరాముడు ఇంత అందంగా ఉండేవాడట..!!

నీలమేఘ శ్యామా నీ రూపం ఎంతసేపు చూసిన తనివితీరటంలేదయ్యా.. అంటూ పుత్రవాత్సల్యంతో మైమరచిపోయేవాడట తండ్రి దశరధుడు. అందాల శ్రీరాముడు, ముగ్ధమనోహర రూపం మన కళ్లముందుకు తీసుకొచ్చింది టెక్నాలజీ.

21 years Sri Ram : 21 ఏళ్ల వయసులో శ్రీరాముడు ఇంత అందంగా ఉండేవాడట..!!

AI created 21 years Sri Ram

Updated On : June 3, 2023 / 3:20 PM IST

21 years Sri Ram : శ్రీరాముడు చాలా అందంగా ఉండేవాడని.. అతని రూపం చూస్తే అలా కళ్లప్పగించి చూస్తుండిపోయేవారట. నీలమేఘ శ్యామా నీ రూపం ఎంతసేపు చూసిన తనివితీరటం లేదయ్యా.. అంటూ పుత్రవాత్సల్యంతో మైమరచిపోయేవాడట దశరధుడు. శ్రీరాముడి ముగ్ధమోహనరూపం గురించి కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు. రామాయణం రాసివారు కూడా శ్రీరాముడు సమ్మోహన రూపం గురించి అద్భుతంగా వర్ణించారు.

 

శ్రీరాముడు నవ యవ్వన రూపాన్ని చూసి మైమరిచిపోనివారు లేరంటే అతిశయోక్తికాదనేలా ఉంది 21 ఏళ్ల రాముడు ఎలా ఉండేవాడో రూపొందించిన చిత్రం చూస్తే. 21 ఏళ్ల వయస్సులో రాముడు ఎలా ఉండేవాడో నవ యవ్వన ముగ్ధమనోహర రూపాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence)చూపించింది.

 

చక్రవర్తి కుమారుడే అయినా ఏమాత్రం గర్వమనేది లేక ఒక సాధారణ తండ్రికి కొడుకు ఎలా ఉండాలో.. ఓ అన్నగా, భర్తగా ఇలా ఎన్నో పాత్రల్లా రాముడు ఆదదర్శంగానిలిచాడు. విలువలతో కూడిన సంపూర్ణమైన జీవితానికి శ్రీరాముడు ఈ సమాజానికి నేటికి ఆదర్శంగా నిలిచాడు. ఒక వ్యక్తి ఎలా ఉండాలో చెప్పడానికి శ్రీరాముడు అనుసరించి ఆచరించిన జీవితమే అందరికీ ఆదర్శనీయం. జగదభిరాముడు, సుగుణాభి రాముడు, నీలమేఘశ్యాముడు, సీతామనోభి రాముడు.. రామయ్యను వారి వారి అభిమానాలను బట్టి పిిలుచుకుని మురిసిపోతారు, పరవశించిపోతారు.

 

శ్రీరాముడు ఎలా ఉండేవాడో ఎంత అందంగా ఉండేవాడో రామాయణం రచించిన కవులు వర్ణించటం చదివి ఉంటాం. రాముడి ఊహాజనితమైన ఫొటోలు ఎన్నో చూసి ఉంటాం. కానీ, 21 ఏళ్ల వయసులో ఆయన ఎంత ముగ్ధమనోహరమైన రూపంలో ఉన్నారనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించి చిత్రం చూస్తే అర్థమవుతుంది. నిజంగా ముగ్ధమనోహరరూపుడే అనిపించేంత అందంగా కళ్లు తిప్పుకోనంత అందమైన రూపాన్ని ఆవిష్కరించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన రెండు శ్రీరాముడి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒక ఫొటోలో రాముడు సాధారణంగా ఉండగా, మరో ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు.

 

Also Read: రూ.30లకే 10 పూరీలు.. దంపతుల పెద్ద మనస్సుకు హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు

 

ఈ ఫొటోలపై ఒక యూజర్ స్పందిస్తూ… శ్రీరాముడు అంతటి అందమైన వాడు ఈ లోకంలో మరొకరు పుట్టలేదంటూ పేర్కొన్నారు. ఏఐని ఉపయోగించి ఈ చిత్రాన్ని ఎవరు రూపొందించారనేది మాత్రం తెలియరాలేదు. కానీ, రాముడి చిత్రాలను చూసిన వారంతా తన్మయత్వానికి గురవుతున్నారు. కాషాయరంగు దుస్తులతో రాముడి చిత్రం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.