ప్రైవేటు ల్యాబ్స్ లో తప్పుడు రిపోర్టులు..35 మంది ఐసోలేషన్ కు తరలింపు..డిశ్చార్జ్

  • Published By: madhu ,Published On : June 11, 2020 / 08:08 AM IST
ప్రైవేటు ల్యాబ్స్ లో తప్పుడు రిపోర్టులు..35 మంది ఐసోలేషన్ కు తరలింపు..డిశ్చార్జ్

ప్రైవేటు ల్యాబ్స్ లో తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో 35 మందిని ఐసోలేషన్ కు తరలించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో చోటు చేసుకుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో ఉన్న కొంతమందికి తేలికపాటి జ్వరం, దగ్గు ఉండడంతో కరోనా లక్షణాలున్నట్లు భావించారు. వీరు జిల్లాలోని ప్రైవేటు వైద్యులను సంప్రదించి..నమూనాలు ఇచ్చేందుకు ప్రైవేటు ల్యాబ్స్ కు వెళ్లారు.

కానీ అక్కడ తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినప్పుడు నెగటివ్ వచ్చినట్లు తేలింది. ప్రభుత్వ ఐసోలేషన్ కు తరలించి 3 రోజుల పాటు ఉంచామని, అనంతరం ఆరోగ్యం మెరుగైన తర్వాత..వారిని డిశ్చార్జ్ చేశామన్నారు. అయినా..వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. 
పరీక్షల్లో లోపాలున్నాయని వైద్యాధికారులు గుర్తించారు.

ల్యాబ్ లలో ఒకదానిపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఇతరులకు నోటీసులు ఇచ్చారని నోయిడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. నిబంధనల ప్రకారం పరీక్షలు చేయలేదని గుర్తించామని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించారని వెల్లడించారు. దీనిపై చర్యలు తీసుకొంటామని, కోవిడ్ – 19 పరీక్షలను నిర్వహించడానికి అధికారం లేదని..కానీ డబ్బుల కోసం ఈ విధంగా కొన్ని ల్యాబ్స్ లు చేస్తున్నాయని తెలిపారు. 

Read:మాస్క్ లు ధరిస్తున్నారా..మీరు తెలుసుకోవాల్సిన విషయాలు