5 Upcoming WhatsApp Features : 5 అప్‌కమింగ్ వాట్సాప్ ఫీచర్లు ఇవే.. మరెన్నో సరికొత్త అప్‌డేట్స్ .. ఏయే ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

5 Upcoming WhatsApp Features : ప్రముఖ మెటా ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లను డెవలప్ చేస్తోంది. వాట్సాప్ డెవలపర్లు వాట్సాప్ యూజర్ల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. వాట్సాప్ (WhatsApp) కొత్త అప్‌డేట్స్ అందిస్తోంది.

5 Upcoming WhatsApp Features : 5 అప్‌కమింగ్ వాట్సాప్ ఫీచర్లు ఇవే.. మరెన్నో సరికొత్త అప్‌డేట్స్ .. ఏయే ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

5 Upcoming WhatsApp Features _ New fonts, longer group names and more

Updated On : January 31, 2023 / 9:56 PM IST

5 Upcoming WhatsApp Features : ప్రముఖ మెటా ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లను డెవలప్ చేస్తోంది. వాట్సాప్ డెవలపర్లు వాట్సాప్ యూజర్ల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. వాట్సాప్ (WhatsApp) కొత్త అప్‌డేట్స్ అందిస్తోంది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్, ప్రైవసీని మెరుగుపరచడమే లక్ష్యంగా కొన్ని కొత్త అప్‌డేట్‌లను అందిస్తుంది. కొత్త డెవలప్‌మెంట్‌లతో పాటు, WhatsApp యూజర్లు ఇన్‌స్టంట్ మెసేజ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి కెమెరా స్విచ్, హై క్వాలిటీని పంపే ఆప్షన్, గ్రూపుల కోసం పెరిగిన టెక్స్ట్ లిమిట్, మరిన్నింటితో సహా అనేక కొత్త ఫీచర్లను తీసుకురానుంది.

WAbetainfo ప్రకారం.. WhatsApp యూజర్లు Android, iOS, వెబ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్‌లు ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్నాయి. భవిష్యత్ అప్‌డేట్‌లలో వాట్సాప్ కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. రాబోయే WhatsApp ఫీచర్లు, ఎలా పని చేస్తాయో వివరంగా చూద్దాం.

WhatsAppలో రాబోయే ఫీచర్లు ఇవే :
హై-క్వాలిటీ ఫొటోలను పంపే ఐకాన్ :
WhatsApp డ్రాయింగ్ టూల్ హెడర్‌కు కొత్త సెట్టింగ్ ఐకాన్ యాడ్ చేయాలని యోచిస్తోంది. వాట్సాప్ యూజర్లు తమ ఫొటో క్వాలిటీని ఎడ్జెస్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ ఒరిజినల్ క్వాలిటీలో ఫోటోలను పంపుకోవచ్చు. వాట్సాప్ ఆటోమాటిక్‌గా ఫొటో క్వాలిటీని కుదించే ప్రస్తుత ఆప్షన్ మాదిరిగా కాకుండా ఫీచర్ అభివృద్ధిలో ఉందని తెలిపింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లలో రిలీజ్ కావొచ్చు. అయితే, ఈ ఫీచర్ వచ్చిన తర్వాత, యూజర్లు ఫోటో సెట్టింగ్‌లలో కొత్త ఐకాన్ చూడవచ్చు. వాట్సాప్ ఫొటోను పంపే ముందు క్వాలిటీని ఎడ్జెస్ట్ చేయొచ్చు.

లాంగ్ గ్రూపు సబ్జెక్ట్‌లు :
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం లేటెస్ట్ బీటా అప్‌డేట్‌లో WhatsApp గ్రూప్ సబ్జెక్ట్‌లు, వివరణల కోసం టెక్స్ట్ లిమిట్ పెంచుతోంది. ఇంతకుముందు వాట్సాప్ గ్రూప్ సబ్జెక్ట్ రాసేందుకు 25 అక్షరాలు పరిమితి ఉంటుంది. కానీ త్వరలో, వాట్సాప్ యూజర్లు 100 పదాల వరకు రాసుకోవచ్చు. అదనంగా, ప్లాట్‌ఫారమ్ క్యారెక్టర్‌ల లిమిట్ 512 నుంచి 2048కి పెంచుతుంది. ఇది గ్రూప్ క్యాప్షన్ రాసేందుకు అనుమతినిస్తుంది. ముఖ్యంగా, ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌ల కోసం అందుబాటులో ఉంది. భవిష్యత్ అప్‌డేట్‌లలో మరింత మంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

5 Upcoming WhatsApp Features _ New fonts, longer group names and more

5 Upcoming WhatsApp Features _ New fonts, longer group names and more

Read Also : Infinix Zerobook : 12వ జెన్-ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్‌తో ఇన్‌ఫినిక్స్ జీరోబుక్ ల్యాప్‌టాప్ వచ్చేసింది.. క్రియేటర్ల కోసం స్పెషల్ ఫీచర్లు, భారత్‌లో ధర ఎంతో తెలుసా?

టెక్స్ట్ ఎడిటర్ :
వాట్సాప్ డ్రాయింగ్ టూల్ కోసం కొత్త టెక్స్ట్ ఎడిటర్‌పై కూడా పని చేస్తోంది. Wabetainfo నివేదిక ప్రకారం.. మెటా-యాజమాన్య ప్లాట్‌ఫారమ్ టెక్స్ట్ ఎడిటర్‌ను రీస్టోర్ చేస్తోందని, పంపే ముందు వారి టెక్స్ట్ కస్టమైజ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. త్వరలో మరిన్ని ఫీచర్‌లను యాడ్ చేస్తుందని సూచిస్తుంది. కొత్త టెక్స్ట్ ఎడిటర్‌తో, వాట్సాప్ డ్రాయింగ్ టూల్‌లో 3 కొత్త ఫీచర్లను యాడ్ చేయాలని యోచిస్తోంది.

* కీబోర్డ్ పైన ఉన్న ఫాంట్ ఆప్షన్లను ట్యాప్ చేయడం ద్వారా వివిధ ఫాంట్‌ల మధ్య త్వరగా మారవచ్చు.
* టెక్స్ట్ ఎడ్జెస్ట్ మార్చగల సామర్థ్యం (ఎడమ, మధ్య, కుడి).
* టెక్స్ట్ మధ్య తేడాను గుర్తించేందుకు టెక్స్ట్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చే ఆప్షన్.
* కొత్త టెక్స్ట్ ఎడిటర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది.
* యాప్ ఫ్యూచర్ అప్‌డేట్ రిలీజ్ అయ్యే అవకాశం

కొత్త ఫాంట్‌లు :
అలైన్‌మెంట్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లు కాకుండా.. కొత్త టెక్స్ట్ ఎడిటర్‌కు కొత్త ఫాంట్‌లను యాడ్ చేసే పనిలో కూడా WhatsApp పని చేస్తుందని తెలిపింది. ఈ ఫీచర్ యూజర్లు ఇమేజ్‌లు, వీడియోలు, GIFలలోని టెక్స్ట్ ఎడిట్ చేసేందుకు, విభిన్న ఫాంట్‌లతో టెక్స్ట్ యాడ్ చేయడానికి అనుమతిస్తుంది.

WhatsApp టెక్స్ట్ ఎడిటర్‌లో కాలిస్టోగా, కొరియర్ ప్రైమ్, డామియన్, ఎక్సో 2, మార్నింగ్ బ్రీజ్ ఫాంట్‌లను యాడ్ చేస్తోంది. ఫాంట్‌లు డ్రాయింగ్ ఎడిటర్‌కు మాత్రమే యాడ్ అవుతాయి. టెక్స్ట్ స్టేటస్ అప్‌డేట్స్, చాట్ మెసేజ్‌లకు యాడ్ చేయరు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. భవిష్యత్ అప్‌డేట్‌లలో బీటా టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంటుంది.

iOS యూజర్లు.. కమ్యూనిటీ గ్రూపులో మెసేజ్‌లకు రియాక్షన్ :
ఈ కొత్త అప్‌డేట్ ద్వారా iOS యూజర్లు తమ కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్ గ్రూప్‌లోని మెసేజ్ రియాక్షన్‌లపై వాట్సాప్ పనిచేస్తోందని చెప్పారు. ప్రస్తుతం, WhatsAppలో కమ్యూనిటీ యాడ్ గ్రూపులో పంపిన మెసేజ్‌లకు రియాక్ట్ కావడం సాధ్యం కాదు. అయితే త్వరలో, యాడ్ గ్రూపులోని మెసేజ్‌లకు రియాక్ట్ అయ్యేందుకు WhatsApp త్వరలో యూజర్లను అనుమతించవచ్చు. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. భవిష్యత్ అప్‌డేట్‌లతో కొత్త ఫీచర్ రిలీజ్ కానుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Chrome : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. Incognito మోడ్ బ్రౌజర్‌లో కొత్త ఫింగర్‌ఫ్రింట్ ఫీచర్.. మీ డేటా మరింత భద్రం.. ఎలా వాడాలంటే?