Bollywood Film Release: 6 నెలలు.. 3 వేలకోట్లు.. ఇదీ బాలీవుడ్ టార్గెట్!

టాలీవుడ్ కి పోటీగా అంతే రేంజ్ లో భారీ టార్గెట్ పెట్టుకుంది బాలీవుడ్. 3వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలనే టార్గెట్ తో వరుసగా సినిమాలను లైన్లో పెట్టింది. ఖిలాడీ సూర్యవంశీ ఇచ్చిన..

Bollywood Film Release: 6 నెలలు.. 3 వేలకోట్లు.. ఇదీ బాలీవుడ్ టార్గెట్!

Bollywood Film Release

Bollywood Film Release: టాలీవుడ్ కి పోటీగా అంతే రేంజ్ లో భారీ టార్గెట్ పెట్టుకుంది బాలీవుడ్. 3వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలనే టార్గెట్ తో వరుసగా సినిమాలను లైన్లో పెట్టింది. ఖిలాడీ సూర్యవంశీ ఇచ్చిన ఎనర్జీతో సేమ్ డిసెంబర్ నెల నుంచే థియేటర్స్ లో వేట మొదలెట్టారు హిందీ మేకర్స్. ఒకవేళ ఒమిక్రాన్.. హా శుభం పలకరా పెళ్లికొడుకా అని ఇప్పుడు దాని గురించి ఎందుకు గానీ.. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటూ బాలీవుడ్ వరస సినిమాలని ప్లాన్ చేస్తుంది.

Bigg Boss 5: నో డౌట్ ఈరోజు పింకీ ఎలిమినేషన్ ఖాయం!

తెలుగు సినిమాకు అఖండలాగా.. బాలీవుడ్ కి బూస్టప్ నిచ్చింది సూర్యవంశీ. సల్మాన్ అంతిమ్ ఆ జోష్ ను కంటిన్యూ చేస్తోంది. అయితే 2022 జూన్ వరకు బాలీవుడ్ 3వేల కోట్లకు పైగా భారీ టార్గెట్ తో చిన్న షాకిస్తుంది. 2021 లాస్ట్ మంత్ డిసెంబర్‌లో.. ఫస్ట్ మూవీగా ‘తడప్’ వచ్చేసింది. ‘ఆర్ఎక్స్ 100’ రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో తారా సుతారియా లేడీ లీడ్ కాగా.. సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే ‘తడప్’పై 70 కోట్లకు వరకూ వసూలు చేస్తుందనే ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

Bheemla Nayak: సినిమా ఇంటెన్సిటీని పెంచేసిన అడవి తల్లి సాంగ్

45 కోట్ల డీల్ తో డిసెంబర్ 10న థియేటర్స్ కి వస్తోంది ఛంఢీఘర్ కరే ఆశికీ. పుష్పకు ఒకరోజు ముందు 16న డేట్ లాక్ చేసుకున్న హాలీవుడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ నార్త్ బిజినెస్ 100 కోట్ల వరకూ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే 24న రణ్ వీర్ సింగ్ ‘83’, 31న షాహిద్ కపూర్ ‘జెర్సీ’ సినిమాలు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాయి. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తోనే వస్తున్న ఈ రెండు ప్రాజెక్టులపై బాగానే అంచనాలున్నాయి. ఒక్కో సినిమా 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలనే లక్ష్యంతోనే థియేటర్స్ లో మ్యాచ్ ఆడేందుకు దిగుతున్నాయి.

Pushpa-Acharya: బన్నీ కోసం బాబాయ్.. చిరు కోసం అబ్బాయ్!

2022 జనవరిలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ హిందీ వర్షన్స్ తో పాటూ అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ లాంటి భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రాజమౌళి, ప్రభాస్, అక్షయ్ కుమార్ సినిమాలు ఒక్కొక్కటీ 150 నుంచీ 200 కోట్ల మధ్య కలెక్షన్స్ సాధిస్తాయని అనుకుంటున్నారు. అదీ ఒక్క బాలీవుడ్ మార్కెట్ లోనే. జనవరి ఎండింగ్ లోనే రిలీజ్ ప్రకటించిన జాన్ అబ్రహం అటాక్ నుంచి కూడా డీసెంట్ కలెక్షన్స్ ఆశిస్తున్నారు. ఫిబ్రవరిలో క్యూకట్టిన శభాష్ మిథూ, బధాయి దో, గంగూభాయ్ కతియావాడి, జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలు సింగిల్ సింగిల్ గా 70 నుంచి 100 కోట్ల మార్క్ తో బరిలోకి దిగుతున్నాయి.

Kate Sharma: పరువాలతో కాటేస్తున్న కాటే శర్మ!

2022 మార్చ్ నెల్లో అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే, రణ్ బీర్ కపూర్ షంషేరా, కార్తీక్ ఆర్యన్ భూల్ భులయ్యా 2 వంటి సినిమాలు 150 నుంచీ 200 కోట్ల క్లబ్‌లో చేరేందుకు ఆరాటపడుతున్నాయి. సమ్మర్ సీజన్‌ స్టార్టింగ్ ఏప్రిల్ నెలలో మాధవన్ రాకెట్రీ, కంగనా ధక్కడ్, కేజీఎఫ్2, లాల్ సింగ్ చద్దా, హీరోపంతి 2, రన్‌వే 34 లాంటి మంచి బిజినెస్ చేసే అవకాశముంది. లీస్ట్ 70కోట్ల నుంచి హైయ్యెస్ట్ 200 కోట్ల వరకు ఇవి కాసులు కురిపిస్తాయని నమ్ముతున్నారు మేకర్స్. మే నెలలో సిద్ధార్ధ్ మల్హోత్రా, రష్మికాల మిషన్ మజ్నూ, అజయ్ దేవగణ్ మైదాన్ సినిమాలతో పాటూ టాలీవుడ్ రీమేక్ హిట్ థియేటర్స్ కి వస్తున్నాయి.

Mahesh Babu: మహేష్ చేతికి మరో బ్రాండ్.. ఏడాదికి రూ.15 కోట్లు?

జూన్‌లో గోవిందా నామ్ తేరా, డాక్టర్ జీ, నో మీన్స్ నో, జుగ్ జుగ్ జీయో లాంటి చిన్న సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. సో ఈ డిసెంబర్ నుంచి జూన్ వరకు బాలీవుడ్ మార్కెట్ మొత్తంగా 3వేల కోట్ల టార్గెట్ పెట్టుకుంది. జూన్ తర్వాత కూడా ఫోన్ భూత్, సర్కస్, రక్షాబంధన్, ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర, రామ్ సేతు, యోధ, భేడియా, విక్రమ్ వేదా రీమేక్ లాంటి భారీ సినిమాలతో మరో 2 వేల కోట్లకు టార్గెట్ పెట్టుకుంది. మొత్తంగా చూస్తే 2022లో బాలీవుడ్ మార్కెట్ 5 నుంచి 6వేల కోట్ల డీల్స్ ను క్లోజ్ చేయాలని తహతహలాడుతోంది. అయితే ఇదంతా సినిమా కమర్షియల్ హిట్ కొడితేనే.. కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా.. ఇంకేదైనా జరిగినా.. అసలుకే ఎసరొచ్చే అవకాశమూ లేకపోలేదు.