కరోనా వైరస్ ఇప్పట్లో పోదు.. మరో రెండేళ్లు మనతోనే ఉంటుంది : రిపోర్ట్

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 04:27 AM IST
కరోనా వైరస్ ఇప్పట్లో పోదు.. మరో రెండేళ్లు మనతోనే ఉంటుంది : రిపోర్ట్

కరోనావైరస్ మహమ్మారి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది రోగనిరోధక శక్తి వచ్చేవరకు నియంత్రించలేరని నిపుణుల బృందం ఒక నివేదికలో తెలిపింది. అనారోగ్య లక్షణాలు కనిపించని వ్యక్తుల నుంచి వ్యాప్తి చెందగల సామర్థ్యం కారణంగా.. ఇటీవలి చరిత్రలో ఇన్ఫ్లుఎంజా కంటే కరోనా వైరస్‌ను నియంత్రించడం కష్టమని University of Minnesota లోని Center for Infectious Disease Research, Policy నివేదికలో పేర్కొంది. లక్షణాలు కనిపించడానికి మందే ఈ వైరస్ అంటువ్యాధులా అందరికి సోకుతుంది. 

నివేదిక ప్రకారం.. ఒక దేశం నుంచి మరో దేశానికి కరోనా వ్యాప్తిని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను ఆయా దేశాలు లాక్ డౌన్ చేశాయి. ఒక్కొక్కటిగా కరోనా వ్యాప్తి ప్రభావం బట్టి దేశ ప్రభుత్వాలు ఇప్పుడు వ్యాపారాలు, బహిరంగ ప్రదేశాలను తిరిగి తెరవడానికి జాగ్రత్తగా అనుమతిస్తున్నాయి. కరోనావైరస్ మహమ్మారి 2022 దాటినా కూడా ఇంకా వ్యాప్తిచెందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 

 ‘ప్రభుత్వ అధికారుల నుండి వచ్చే రిస్క్ కమ్యూనికేషన్ మెసేజింగ్.. ఈ మహమ్మారి త్వరలోనే అంతమైపోదు అనే భావనను కలిగి ఉండాలి. రాబోయే రెండేళ్ళలో ప్రజలు ఎప్పటికప్పుడు తిరిగి వచ్చే వ్యాధికి సిద్ధంగా ఉండాలని నిపుణులు చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే తక్కువ పరిమాణంలో వ్యాక్సిన్లను తయారు చేయడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. 

2009-2010 ఫ్లూ మహమ్మారికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ అందుబాటులో లేవు. అమెరికాలో వ్యాప్తి చెందే వరకు ఒక అధ్యయనం ప్రకారం.. ఆ దేశంలోనే 1.5 మిలియన్ కేసులు, 500 మరణాలను నిరోధించాయని అన్నారు.  సిడ్రాప్ డైరెక్టర్ Michael Osterholm, మెడికల్ డైరెక్టర్ Kristen Moore, Tulane యూనివర్శిటీ public health historian జాన్ బారీ,  హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎపిడెమియాలజిస్ట్ మార్క్ లిప్‌సిచ్ ఈ నివేదికను వెల్లడించారు. 

Also Read | కరోనాకు రెమెడెసివర్ కరెక్ట్ మెడిసిన్ అంటోన్న గిలీద్..