Indian Citizenship: భారత పౌరసత్వం వదులుకున్న ఏడున్నర లక్షల మంది
గడిచిన ఆరేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల మంది పౌరులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2016 నుంచి ఏడున్నర లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకోగా, దాదాపు ఆరు వేల మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది.

Indian Citizenship
Indian Citizenship: గడిచిన ఆరేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల మంది పౌరులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2016 నుంచి ఏడున్నర లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకోగా, దాదాపు ఆరు వేల మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2016-2021 వరకు గణాంకాల ఆధారంగా రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయాల్ని వెల్లడించింది. ఈ డాటా ప్రకారం.. 7,49,765 మంది భారత్ విడిచిపెట్టి, 106 దేశాల్లో స్థిరపడ్డారు.
India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. 55 మంది మృతి..
2019లో అత్యధికంగా 1.44 లక్షల మంది దేశం విడిచిపెట్టారు. 2016లో 1.41 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2020లో మాత్రం చాలా తక్కువ మంది దేశాన్ని వదిలి వెళ్లారు. విదేశాల్లో స్థిరపడ్డ వాళ్లలో దాదాపు 82 శాతం మంది అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకే వెళ్లారు. 2016-2021 మధ్యకాలంలో 2,174 మంది చైనాకు వలస వెళ్లారు. 2020-21లలో 31 మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని పాకిస్తాన్‌కు వలస వెళ్లారు. ఇక, భారత పౌరసత్వం పొందిన వాళ్లలో హిందువులతోపాటు, జైనులు, సిక్కులు, క్రిస్టియన్లు ఉన్నారు.