హైదరాబాద్‌లో ఉంటున్నారా? కరోనా వచ్చినట్లే!

హైదరాబాద్‌లో ఉంటున్నారా? కరోనా వచ్చినట్లే!

కరోనా అంటే వణికిపోయేవారు మొదట్లో.. అయితే ఇప్పుడు కాస్త భయం తగ్గింది కానీ, కరోనా వైరస్ దాదాపుగా ప్రతీ ఇంటిని టచ్ చేసినట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా? మీకు కరోనా వచ్చిందా? లేదా? ఎప్పుడన్నా టెస్ట్‌ చేయించుకున్నారా? లేదా?., చేయించుకున్నా నెగటివ్‌ వచ్చిందా?., నెగటివ్‌ వచ్చిందని రాలేదని అకుంటున్నారా? కానీ మీకే తెలియకుండా మీకు కరోనా వచ్చేసి వెళ్లిపోయి ఉంటుంది అంటుంది సీసీఎంబీ రిపోర్ట్.. హైదరాబాద్ నగరంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా వచ్చిందట.

వార్డుకు మూడు వందల మంది చొప్పున సీరో సర్వే కోసం శాంపిల్స్ సేకరించగా.. 10 ఏళ్ల పిల్లల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఈ సర్వేలో పాల్గొనగా.. కొన్ని వార్డుల్లో 70 శాతం, మరికొన్ని వార్డుల్లో 30 శాతం మందిలో యాంటీబాడీస్‌ ఉన్నట్లు గుర్తించారు. సగటున 50 నుంచి 60 శాతం మందిలో యాంటీబాడీస్‌ను కనుగొన్నట్లు వెల్లడించారు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేష్‌మిశ్రా. పురుషుల కంటే మహిళల్లో అత్యధిక యాంటీబాడీస్‌ ఉన్నట్లు సర్వేలో తేలింది. మహిళల్లో 56 శాతం యాంటీబాడీస్‌ ఉంటే.. పురుషుల్లో 53 శాతం యాంటీబాడీస్‌ ఉన్నాయని అధ్యయనంలో తేలింది. మొత్తంగా చూస్తే 75 శాతం మందికి కరోనా వచ్చినట్లు కూడా తెలియలేదని సర్వే చెబుతోంది.

కరోనా బారిన పడ్డవారి కుటుంబీకుల్లో… 78 శాతం మందికి యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయినట్లు, 68 శాతం మందికి సమూహాల ద్వారా వైరస్‌ వచ్చి పోయినట్లు అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌లోని చిన్న కుటుంబాల్లోని వారికి, చిన్న చిన్న గదుల్లో నివాసముండేవారికి కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు సీరో సర్వేలో స్పష్టమైంది. సీరో రిపోర్ట్‌ ప్రకారం…హైదరాబాదీలు హెర్డ్‌ ఇమ్యునిటీ సాధించారంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే దాదాపుగా హైదరాబాద్‌లో ప్రతి ఇంటిలో కూడా కరోనా వచ్చినట్లే లెక్క..