Dairy Management : డెయిరీ నిర్వహణలో విజయం సాధించిన యువకుడు
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువరైతు మాత్రం కృషి, పట్టుదలతో విజయం సాధించారు. స్వయంకృషితో పాడి పరిశ్రమను ఏర్పాటు మేలుజాతి గేదెల పెంపకం చేపడుతూ.. తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నాడు. తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇదే ఆచరించి చూపుతున్నారు

Dairy Management
Dairy Management : చేసే ఏ పనిలో అయినా, సంపద ఉంటే చాలదు, సంతృప్తి కూడా ముఖ్యమే. అది లేకే చాలా మంది యువకులు పలు ఉపాధి రంగాల్లో సక్సెస్ కాలేకపోతున్నారు. పాలకు స్థిరంగా గిరాకీ ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. కానీ పశువుల పెంపకం అంత సులభం అయితే కాదు. పశువుల పెంపకంపై ప్రేమ, శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతేనే విజయం తథ్యం.
READ ALSO : Neem Benifits : వేపతో వ్యవసాయంలో బహుళ ప్రయోజనాలు!
కానీ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువరైతు మాత్రం కృషి, పట్టుదలతో విజయం సాధించారు. స్వయంకృషితో పాడి పరిశ్రమను ఏర్పాటు మేలుజాతి గేదెల పెంపకం చేపడుతూ.. తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నాడు. తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇదే ఆచరించి చూపుతున్నారు ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం, కనుగుట్ట గ్రామానికి చెందిన యువకుడు శ్రావణ్ కుమార్.
యువరైతు శ్రవణ్ చదివిండి పిజి. కార్పోరేట్ కంపెనీల్లో మార్కెటింగ్ చేసేవారు. అయితే చేస్తున్న ఉద్యోగం సంతృప్తి నివ్వకపోవడంతో సొంతఊరికి చేరుకొని , తనకున్న 5 ఎకరాల్లో డెయిరీఫాం నెలకొల్పారు. గుజరాత్ నుండి మేలుజాతి గేదెలను దిగుమతి చేసుకొని డెయిరీఫాం నిర్వహిస్తున్నారు.
READ ALSO : Machinery In Agriculture : వ్యవసాయంలో యంత్రాల వినియోగంతో ఖర్చు తక్కువ, సమయం అదా!
పచ్చిగడ్డితో పాటు సమీకృత దాణా అందించడంతో పాలదిగుబడి పెరుగుతోంది. వచ్చిన పాలను వినియోగదారులు డెయిరీ వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. త్వరలోనే మిల్క్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు శ్రవణ్ సిద్ధమవుతున్నారు.