Crazy Fellow: ‘క్రేజీ ఫెలో’ రిలీజ్ డేట్ లాక్ చేసిన ఆది సాయికుమార్!

యంగ్ హీరో ఆది సాయికుమార్ టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్టు, ఫ్లాపు తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ....

Crazy Fellow: ‘క్రేజీ ఫెలో’ రిలీజ్ డేట్ లాక్ చేసిన ఆది సాయికుమార్!

Aadi Sai Kumar Locks Crazy Fellow Release Date

Crazy Fellow: యంగ్ హీరో ఆది సాయికుమార్ టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్టు, ఫ్లాపు తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తన దూకూడును ప్రదర్శిస్తున్నాడు ఈ హీరో. మినిమం గ్యారెంటీ హీరోగా ఆది సాయికుమార్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో అతడితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపడమే కాకుండా, అతి తక్కువ సమయంలో అతడితో సినిమాలను చేస్తూ రిలీజ్ చేసేస్తున్నారు.

Aadi Saikumar : తిరుపతిలో తీస్ మార్ ఖాన్..

ఇక ఇప్పుడు ఈ హీరో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యాడు. ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసుకున్న ఆది సాయికుమార్, ఈ సినిమాను సెప్టెంబర్ 16న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ తాజాగా చేసింది. ఈ సినిమాలో ఇద్దరు భామలతో ఓ కుర్రాడు చేసే ప్రేమాయణం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనే కోణాన్ని మనకు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఆది చాలా స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపిస్తున్నాడు. చేతిలో పూల బొకే పట్టుకుని తన ప్రేయసికి ఇచ్చేందుకు రెడీ అయిన ప్రేమికుడిగా ఆది సాయికుమార్ కనిపిస్తున్నాడు.

Aadi SaiKumar : ఆది సాయి కుమార్ హీరోగా, సునీల్ కీ రోల్‌లో సినిమా..

క్రేజీ ఫెలో సినిమాను ఫణికృష్ణ సిరికి డైరెక్ట్ చేస్తుండగా, కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్లుగా అందాల భామలు దిగంగన సూర్యవంశీ, మర్నా మీనన్‌లు నటిస్తున్నారు. మరి క్రేజీ ఫెలో చిత్రంతో ఆది సాయికుమార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.