Aadi Saikumar : తిరుపతిలో తీస్ మార్ ఖాన్..

ప్రస్తుతం ఓ పక్క షూటింగ్ చేస్తూనే మరో పక్క చిత్ర ప్రమోషన్స్‌ కూడా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా యూట్యూబ్ లో మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తీస్ మార్ ఖాన్ సినిమా ప్రమోషన్స్ లో..............

Aadi Saikumar : తిరుపతిలో తీస్ మార్ ఖాన్..

Teesmaarkhan

Teesmaarkhan : యువ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నాటకం లాంటి డిఫరెంట్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రొడక్షన్ నెంబర్ 3గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఓ పక్క షూటింగ్ చేస్తూనే మరో పక్క చిత్ర ప్రమోషన్స్‌ కూడా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా యూట్యూబ్ లో మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తీస్ మార్ ఖాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినిమా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న ఆయన తీస్ మార్ ఖాన్ సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు.

Sai Pallavi : పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పిన సాయిపల్లవి..అలాంటి వాళ్ళు వద్దంట..

ఇక ఇటీవల రిలీజ్ అయిన తీస్ మార్ ఖాన్ టీజర్ సినిమాపై అంచనాలని పెంచింది. ఈ సినిమాలో హీరో ఆది సాయి కుమార్ క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉండనుంది. అలాగే ఇందులో ఆది విభిన్న షేడ్స్ చూపిస్తూ మూడు క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో రొమాంటిక్ సన్నివేశాలు మరోసారి యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్‌గా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్.. ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయి కుమార్ నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.