Mistake : ‘మిస్టేక్’ మూవీ రివ్యూ.. ఒక్క మిస్టేక్‌తో భలే నవ్వించి థ్రిల్ ఫీల్ అయ్యేలా చేశారుగా..

అభిన‌వ్ స‌ర్దార్(Abhinav Sardar) ముఖ్య పాత్రలో 'రామ్ అసుర్‌'(Ram Asur) సినిమా తర్వాత న‌టించిన లేటెస్ట్ మూవీ 'మిస్టేక్‌'. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి(సన్నీ) తెరకెక్కించగా ASP బ్యానర్ పై నిర్మితమైంది. మిస్టేక్ సినిమా నేడు ఆగస్ట్ 4న రిలీజ్ అవ్వగా థియేటర్స్ లో సందడి చేస్తుంది.

Mistake : ‘మిస్టేక్’ మూవీ రివ్యూ.. ఒక్క మిస్టేక్‌తో భలే నవ్వించి థ్రిల్ ఫీల్ అయ్యేలా చేశారుగా..

Abhinav Sardar Mistake Movie Review and Audience Rating

Mistake Movie Review :  నటుడు అభిన‌వ్ స‌ర్దార్(Abhinav Sardar) ముఖ్య పాత్రలో ‘రామ్ అసుర్‌'(Ram Asur) సినిమా తర్వాత న‌టించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టేక్‌’. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి(సన్నీ) తెరకెక్కించగా ASP బ్యానర్ పై నిర్మితమైంది. మిస్టేక్ సినిమా నేడు ఆగస్ట్ 4న రిలీజ్ అవ్వగా థియేటర్స్ లో సందడి చేస్తుంది.

కథ విషయానికి వస్తే.. ఒకే రూమ్ లో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్ కి వేరు వేరు సమస్యలు వచ్చి వాళ్ళని వారం రోజుల్లో చంపేస్తామని బెదిరింపులు వస్తాయి. దీంతో ఒక వారం రోజులు ఎక్కడికైనా కనపడకుండా వెళ్లిపోవాలని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తారు. అలా ట్రిప్ కి మొదలయి మూడు జంటలు ఎంజాయ్ చేస్తుంటే ఓ వ్యక్తి(అభినవ్ సర్దార్) వీళ్ళని వెంబడిస్తాడు. ఇక అక్కడినుంచి సినిమా థ్రిల్లింగ్ గా సాగుతుంది. అసలు ఆ వ్యక్తి ఈ మూడు జంటలని ఎందుకు వెంబడిస్తాడు? వాళ్ళు వారం రోజుల్ తర్వాత ఏమయ్యారు? వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి తెలియాలంటే తెరపైనే చూడాలి.

మిస్టేక్.. ఫస్ట్ హాఫ్ కామెడీ, కొంచెం ఛేజింగ్ తో సాగుతుంది. కొంచెం బోల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బోర్ కొడుతుంది కానీ థ్రిల్లింగ్ గా సాగుతుంది. ప్రేక్షకులని కదలకుండా కుర్చోపెట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడా ఉన్న బోల్డ్ కంటెంట్ కి ఫ్యామిలీస్ తో చూడటం కొంచెం కష్టమే. లెంగ్త్ కూడా తక్కువే ఉంది కాబట్టి సరదాగా సినిమాని ఒక్కసారి చూసి రావచ్చు. టెక్నీకల్ వ్యాల్యూస్ బాగున్నాయి. డ్యాన్స్ మాస్టర్ సన్నీ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. అభినవ్ సర్దార్ నెగిటివ్ రోల్ లో మెప్పించాడు. అతనికి ఇంకొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే బాగుండేది. మూడు జంటలుగా అజయ్ క‌తుర్‌వ‌ర్‌, సుజిత్, తేజ ఐనంపూడి, క‌రిష్మా కుమార్‌, తానియా క‌ల్రా, ప్రియా పాల్ కామెడీ, రొమాంటిక్ సన్నివేశాల్లో అలరించారు. పాటలు మాత్రం కొంచెం డిఫరెంట్ గా చాలా బాగున్నాయి. ప్రేక్షకులు పాటలని బాగా ఎంజాయ్ చేస్తారు.

WOLF Teaser : ప్రభుదేవా ‘వూల్ఫ్’ టీజర్ చూశారా.. కొత్త కాన్సెప్ట్.. కొత్త ప్రపంచం..

ఒక చిన్న మిస్టేక్ తో అదేంటో సినిమా చివరి వరకు తెలియకుండా మూడు జంటలు, ఒక విలన్ తో సినిమా బాగా సాగింది. సినిమా నాలెడ్జి ఉన్నవాళ్లు మాత్రం మిస్టేక్ ని సెకండ్ హాఫ్ లో గ్రహించగలరు. ఓవరాల్ గా ఒక్క మిస్టేక్ తో 2 గంటల పాటు నవ్వించి కవ్వించి థ్రిల్ కి గురి చేశారు చిత్రయూనిట్.