Acharya: ఆచార్య 4 రోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ ఫెయిల్!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ రిలీజ్ కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఫెయిల్యూర్ లేని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న...

Acharya: ఆచార్య 4 రోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ ఫెయిల్!

Acharya 4 Days Worldwide Collections

Acharya: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ రిలీజ్ కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఫెయిల్యూర్ లేని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర చేస్తున్న సినిమా.. చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్న సినిమా.. అబ్బో… ఇలా ‘ఆచార్య’ సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లి సెట్ చేశారు చిత్ర యూనిట్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.. అంతే భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా జరిపింది. కానీ సినిమా రిలీజ్ రోజునే సీన్ రివర్స్ అయ్యింది.

ఆచార్య రిలీజ్ రోజునే ఈ సినిమాకు నెగెటివ్ మౌత్ టాక్ రావడం, ఈ సినిమాను ఏ కోసాన కూడా కోలుకోనివ్వకుండా చేసింది. తొలిరోజు సినిమా చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా మంచి డీసెంట్ కలెక్షన్లు రావడం సహజం. కానీ ఆచార్యకు అసలు సినిమా రెండో రోజు నుండి కనిపించింది. వీకెండ్ అయిన శని, ఆదివారాల్లో ఈ సినిమాను చూసేందుకు జనం పెద్దగా ఆసక్తిని చూపలేదు. దీంతో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.38.72 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

ఇక ఆచార్యకు అసలుసిసలైన పరీక్ష సోమవారం ఎదురయ్యింది. మంచి మౌత్ టాక్ ఉండి, భారీ క్యాస్టింగ్ ఉన్న సినిమాలకు సోమవారం నాడు అంతంత మాత్రంగా పబ్లిక్ వెళ్తుంటారు. ఇక ఆచార్య లాంటి ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న సినిమాను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులెవరూ ఆసక్తిని కనబర్చలేదు. ఫలితంగా నాలుగో రోజైన సోమవారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య చిత్రానికి కేవలం రూ.53 లక్షల షేర్ వసూళ్లు మాత్రమే దక్కాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులు ముగిసే సరికి ఈ సినిమాకు రూ.46.18 కోట్ల షేర్ వసూళ్లు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏరియాలవారీగా ఈ సినిమా 4 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.11.79 కోట్లు
సీడెడ్ – రూ.5.96 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.4.73 కోట్లు
ఈస్ట్ – రూ.3.18 కోట్లు
వెస్ట్ – రూ.3.31 కోట్లు
గుంటూరు – రూ.4.52 కోట్లు
కృష్ణా – రూ.2.91 కోట్లు
నెల్లూరు – రూ.2.85 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.39.25 కోట్లు (రూ.57.05 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – రూ.2.50 కోట్లు
ఓవర్సీస్ – రూ.4.43 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.46.18 కోట్లు (రూ.72.00 కోట్ల గ్రాస్)