Acharya : ‘సిద్ధ’ టీజర్ వచ్చేస్తోంది..

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ నుండి అదిరిపోయే అప్‌డేట్..

Acharya : ‘సిద్ధ’ టీజర్ వచ్చేస్తోంది..

Siddha

Updated On : November 24, 2021 / 4:54 PM IST

Acharya: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’.. మొన్నామధ్య విడుదల చేసిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.

Acharya : అయ్యోరింటి సుందరి.. వయ్యారాల వల్లరి ‘నీలాంబరి’..

చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే స్వరబ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ‘లాహే లాహే’, ‘నీలాంబరి’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం సాయంత్రం కొత్త అప్‌డేట్ ఇచ్చింది టీం.

Tamannaah Bhatia : అరిటాకులో భోజనం.. దేవతలా మారిన తమన్నా..

నవంబర్ 28న చరణ్ చేస్తున్న సిద్ధ క్యారెక్టర్ టీజర్ విడుదల చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు #Siddha ‘s Saga హ్యాష్ ట్రాగ్ టెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో విడుదల కానుంది. సంగీతం : మణిశర్మ, కెమెరా : తిరు, ఎడిటింగ్ : నవీన్ నూలి.