Acharya : సిద్ధ టీజర్ ఇదిగో!

‘ఆచార్య’ నుండి రామ్ చరణ్ ‘సిద్ధ’ టీజర్ రిలీజ్ చేశారు..

Acharya : సిద్ధ టీజర్ ఇదిగో!

Siddha's Saga Teaser

Updated On : November 28, 2021 / 4:51 PM IST

Acharya: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’.. మొన్నామధ్య విడుదల చేసిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.

Akhanda Pre Release Event : ‘అఖండ’ సాక్షిగా బన్నీ – బాలయ్య బాండింగ్ అదిరింది..

చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే స్వరబ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ‘లాహే లాహే’, ‘నీలాంబరి’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా చరణ్ చేస్తున్న సిద్ధ క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. చరణ్ సరికొత్త క్యారెక్టర్‌‌లో డిఫరెంట్ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు.

Chiranjeevi : శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి చిరంజీవి సాయం

ఆర్ఆర్‌లో వచ్చే శ్లోకంతో సిద్ధ క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేశారు. ‘ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకుపంపుద్ది’ అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో విడుదల కానుంది. సంగీతం : మణిశర్మ, కెమెరా : తిరు, ఎడిటింగ్ : నవీన్ నూలి.