Kajal Aggarwal : హ్యాపీ బర్త్‌డే కాజల్ అగర్వాల్..

పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ టీం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కాజల్ స్టిల్ వదిలారు.. ట్రెడిషనల్ వేర్‌లో కాజల్ మెరిసిపోతోంది..

Kajal Aggarwal : హ్యాపీ బర్త్‌డే కాజల్ అగర్వాల్..

Acharya Team Wishes Actress Kajal Aggarwal A Very Happy Birthday

Updated On : June 19, 2021 / 1:13 PM IST

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. జూన్ 19 కాజల్ పుట్టినరోజు. విశేషం ఏంటంటే.. పెళ్లైన తర్వాత కాజల్ జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్‌డే ఇది.

అలాగే పెళ్లి తర్వాత కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. విడుదలవబోతున్న ఫస్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ‘ఆచార్య’.. ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత చిరుతో కాజల్ యాక్ట్ చేస్తున్న రెండో సినిమా ‘ఆచార్య’. పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ టీం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కాజల్ స్టిల్ వదిలారు. ట్రెడిషనల్ వేర్‌లో కాజల్ మెరిసిపోతోంది.

2004లో వివేక్ ఒబెరాయ్, ఇశ్వర్య రాయ్ నటించిన ‘Kyun! Ho Gaya Na’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్, నందమూరి కళ్యాణ్ రామ్ – తేజ కాంబోలో వచ్చిన ‘లక్ష్మీకళ్యాణం’ తో టాలీవుడ్‌కి పరిచయమయ్యింది. తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుని, స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూ.. కళ్యాణ్ రామ్ ‘ఎంఎల్ఎ’ సినిమాతో 50 సినిమాల మైలురాయిని దాటింది కాజల్ అగర్వాల్.