Prabhas : హైదరాబాద్ రోడ్లపై లగ్జరీ కార్లలో దూసుకుపోతున్న ప్రభాస్..

ప్రభాస్ కి వెహికల్స్, స్పెషల్లీ కార్లంటే బాగా ఇంట్రస్ట్. అందుకే ప్రభాస్ గ్యారేజ్ మొత్తం లేటెస్ట్ కార్లతో నిండిపోతూనే ఉంటుంది. ప్రభాస్ బ్లాక్ లంబోర్గినితో పాటు ఆరెంజ్ కలర్ అల్ట్రా పాష్ లంబోర్గినితో అప్పుడప్పుడు తన రేసింగ్..........

Prabhas : హైదరాబాద్ రోడ్లపై లగ్జరీ కార్లలో దూసుకుపోతున్న ప్రభాస్..
ad

Prabhas :  రోడ్ కనపడితేచాలు రయ్ మంటూ దూసుకుపోతూ కనురెప్ప మూసే లోపు కనపడనంత దూరానికి వెళుతున్నారు. ఫార్ములా వన్ రేసర్లని మించి పోయేలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేసింగ్ చేస్తున్నారు. లంబోర్గిని కారుతో హైదరాబాద్ రోడ్ల మీద రయ్ రయ్ అంటూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. గతంలో ప్రభాస్ లంబోర్గిని కారు కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో లంబోర్గిని కార్ కూడా కొన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో ప్రాజెక్ట్ K షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికెళుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అల్ట్రా పాష్ లాంబోర్గినీలో వెళ్తూ కనిపించారు.

Vijay Devarakonda : కరణ్ జోహార్‌కి తనేంటో చూపించడానికే రౌడీ హీరో అలా చేశాడా??

ప్రభాస్ కి వెహికల్స్, స్పెషల్లీ కార్లంటే బాగా ఇంట్రస్ట్. అందుకే ప్రభాస్ గ్యారేజ్ మొత్తం లేటెస్ట్ కార్లతో నిండిపోతూనే ఉంటుంది. ప్రభాస్ బ్లాక్ లంబోర్గినితో పాటు ఆరెంజ్ కలర్ అల్ట్రా పాష్ లంబోర్గినితో అప్పుడప్పుడు తన రేసింగ్ సరదా తీర్చుకుంటూ ఉంటారు. లగ్జరీ లంబోర్గిని కార్లతో పాటు జాగ్వర్, ఆడి, బెంజ్ లాంటి ఖరీదైన స్టైలిష్ కార్లు కూడా ప్రభాస్ దగ్గర ఉన్నాయి. తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికెళ్లే టప్పడే కాదు ప్రభాస్ తన లంబోర్గినినీలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. ప్రభాస్ ఇలా సరదాగా వెళ్తున్నా ప్రభాస్ ఇంత ఫాస్ట్ గా కారు నడుపుతుంటే ప్రొడ్యూసర్లు మాత్రం టెన్షన్ పడుతున్నారు. దాదాపు 2 వేల కోట్ల విలువున్న సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా స్టార్ కి స్పీడ్ తగ్గించు బాబూ అంటూ జాగ్రత్తలు చెబుతున్నారు.