Adipurush : షూటింగ్ లేట్ అయినా ‘ఆదిపురుష్’ చెప్పిన డేట్‌కే వస్తాడు.. గ్రాఫిక్స్ కోసం 100 కోట్లకు పైనే..

సినిమా సినిమాకీ సంవత్సరాలు తరబడి టైమ్ తీసుకునే ప్రభాస్.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్‌గా షూటింగ్స్ చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్, అందులోనూ రామాయణం.. ఇక ఈ సినిమా ఎప్పటికవుతుందో అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేసిన వాళ్లందరి నోళ్లు మూయిస్తున్నారు ‘ఆదిపురుష్’ టీమ్.. మరి జెట్ స్పీడ్‌లో షూట్ చేస్తున్న ‘ఆదిపురుష్’ ఎక్కడి వరకొచ్చాడో, ఆ సినిమా విశేషాలంటో ఓసారి చూద్దాం..

Adipurush : షూటింగ్ లేట్ అయినా ‘ఆదిపురుష్’ చెప్పిన డేట్‌కే వస్తాడు.. గ్రాఫిక్స్ కోసం 100 కోట్లకు పైనే..

Adipurush

Adipurush: సినిమా సినిమాకీ సంవత్సరాలు తరబడి టైమ్ తీసుకునే ప్రభాస్.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్‌గా షూటింగ్స్ చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్, అందులోనూ రామాయణం.. ఇక ఈ సినిమా ఎప్పటికవుతుందో అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేసిన వాళ్లందరి నోళ్లు మూయిస్తున్నారు ‘ఆదిపురుష్’ టీమ్.. మరి జెట్ స్పీడ్‌లో షూట్ చేస్తున్న ‘ఆదిపురుష్’ ఎక్కడి వరకొచ్చాడో, ఆ సినిమా విశేషాలంటో ఓసారి చూద్దాం.

Adipurush

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి అసలు ఎక్కడా ఆగకుండా ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడిగా కనిపిస్తుంటే రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారని ఇప్పటికే అనౌన్స్ చేసిన టీమ్ సినిమాకు సంబంధించి 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేసింది.

‘ఆదిపురుష్’ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ప్రభాస్ ఈ సినిమాలో రాముడిగా కనిపించడానికి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఎప్పటి కప్పుడు బాడీని మౌల్డ్ చేసుకున్న ప్రభాస్.. ‘ఆదిపురుష్’ గా తన లుక్‌ని అల్టిమేట్‌గా చూపించబోతున్నారని చెప్పారు డైరెక్టర్ ఓం రౌత్. అంతే కాదు సీతగా కనిపించబోతున్న కృతి సనన్ అయితే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడానికి స్పెషల్ ట్యూటర్‌ని పెట్టించుకుని మరీ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తోంది. ఇలా ‘ఆదిపురుష్’ టీమ్ మొత్తం షూట్ ఫినిష్ చెయ్యడానికి ఫుల్ కమిట్‌మెంట్‌తో ఉన్నారు.

Adipurush

‘ఆదిపురుష్’ సినిమా అయితే అనౌన్స్ చేశారు కానీ, అప్పుడే స్టార్ట్ అవుతుందా అనుకున్నారు అందరూ. కానీ భారీ బడ్జెట్‌తో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ కి సంబంధించి గ్రాఫిక్ వర్క్ ఇప్పటికే స్పీడందుకుంది. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలో దాదాపు 100 కోట్లకు పైగా గ్రాఫిక్స్ మీదే ఖర్చు చెయ్యబోతున్నారు.. అంతకుముందు ప్రభాస్ సినిమాల్లాగా భారీ సెట్లు, భారీగా యూనిట్ అవసరం లేకుండా సింపుల్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో సినిమాని స్పీడప్ చేస్తున్నారు ‘ఆదిపురుష్’ అండ్ కో. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ కోవిడ్ ఎఫెక్ట్‌తో ప్రస్తుతం షూట్‌కి బ్రేక్ వచ్చినా అనుకున్న డేట్‌కే రిలీజ్ అవుతుందని, రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండదని మరోసారిక్లారిటీ ఇచ్చారు ఓం రౌత్..