Black Box : హెలికాప్టర్ ప్రమాద స్థలికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్

హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది.

Black Box : హెలికాప్టర్ ప్రమాద స్థలికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్

Black Box

Updated On : December 9, 2021 / 12:49 PM IST

Black Box : తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్‌ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్‌ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది. ఘటనాస్థలికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకొని వెల్లింగ్టన్ బేస్ క్యాంపుకు తరలించారు. బ్లాక్ బాక్స్ కనుగొనేందుకు వింగ్ కమాండర్ ఆర్ భరద్వార్ నేతృత్వంలోని 25 మంది సభ్యుల వైమానిక బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ రోజు బ్లాక్‌బాక్స్ ఢిల్లీ తరలించి అందులోని డేటాను డీకోడ్ చేస్తారు.

చదవండి : Bipin Rawat : ద‌ట్ట‌మైన పొగ‌మంచులో రావ‌త్ హెలికాప్ట‌ర్‌.. వైరల్ వీడియో

కాగా బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించారు. మృతుల్లో సీడీఎస్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక రావత్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎయిర్ ఫోర్స్ ఫైలెట్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని తెలిపారు.

చదవండి : Bipin Rawat : ఆ హెచ్చరిక చేసిన మరుసటి రోజే ఘోరం.. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దుర్మరణం