Delhi Air Pollution: ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఎన్సీఆర్ ప్రజలు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ఫరీదాబాద్‌లలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. కాలుష్యంతో కళ్ళ మంటలు, గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడానికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పర్యావరణంలో దుమ్ము, ధూళి కణాల శాతం పెరగడంతో గాలి నాణ్యత క్షీణించింది.

Delhi Air Pollution: ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఎన్సీఆర్ ప్రజలు

Delhi Pollution

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ఫరీదాబాద్‌లలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. కాలుష్యంతో కళ్ళ మంటలు, గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడానికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పర్యావరణంలో దుమ్ము, ధూళి కణాల శాతం పెరగడంతో గాలి నాణ్యత క్షీణించింది. పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనంతో ప్రతీయేటా వాయు కాలుష్యం‌తో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, రోడ్లు, చెట్లపై ఉన్న దుమ్మును శుభ్రపరిచేందుకు వాటర్ ట్యాంకర్లు, స్మాగ్ గన్స్‌తో సిబ్బంది నీటిని చల్లుతున్నారు.

Delhi Pollution..Schools Closed: ఢిల్లీలో కాలుష్యం తగ్గట్లేదు..మరోసారి స్కూల్స్ మూసివేత..

ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 431 పాయింట్లుగా నమోదుకాగా, నోయిడా‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 529 పాయింట్లు, అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 475 పాయింట్లుగా, గురుగావ్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 478 పాయింట్లుగా నమోదైంది. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం ఉన్న నేపథ్యంలో అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. కాలుష్యం తగ్గి వాతావరణం మెరుగు పడిన తరువాత తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్కూల్స్ కి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం సిబ్బందితో కార్యకలాపాలు, మరో 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. నిర్మాణ రంగం పనులపైనా ప్రభుత్వం నిషేధం విధించింది. నిర్మాణ పనులు నిలిపివేస్తున్నందుకు భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 5వేల సహాయం అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర సేవల ట్రక్కులు మినహా ఢిల్లీలో డీజిల్ ట్రక్కులపై నిషేధం విధించింది. ఢిల్లీలోకి డీజిల్ ట్రక్కులు రాకుండా రవాణా శాఖకు చెందిన 120 బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ఢిల్లీ హాట్‌స్పాట్‌లలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు చేశారు. కాలుష్య నియంత్రణ అమలును పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యుల ప్యానెల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైల్వే, మెట్రో, విమానాశ్రయాలు రక్షణ కార్యకలాపాల ప్రాజెక్ట్‌లు హైవేలు, ఫ్లైఓవర్‌లు, పబ్లిక్ ప్రాజెక్ట్‌ల పనులకు నిషేధం నుండి ఢిల్లీ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.