Aishwary Rajesh : మహిళా డ్రైవర్ కి ఆటో ఇచ్చిన హీరోయిన్.. మహిళా డ్రైవర్స్ తో కలిసి తన సినిమా స్పెషల్ షో..

సెలబ్రేషన్స్ లో భాగంగా పలువురు మహిళా డ్రైవర్స్ తో కలిసి డ్రైవర్ జామున సినిమా స్పెషల్ షో చూశారు హీరోయిన్ ఐశ్వర్య. అనంతరం ఆ మహిళా డ్రైవర్స్ తో ముచ్చటించారు................

Aishwary Rajesh : మహిళా డ్రైవర్ కి ఆటో ఇచ్చిన హీరోయిన్.. మహిళా డ్రైవర్స్ తో కలిసి తన సినిమా స్పెషల్ షో..

Aishwary Rajesh gifted auto to a women driver

Aishwary Rajesh :  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి అనంతరం హీరోయిన్ గా ఎదిగింది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేస్తుంది. హీరోయిన్ గానే కాక మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ గా కూడా పలు సినిమాలు చేస్తుంది. ఇటీవలే డ్రైవర్ జామున అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజయింది.

ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. తమిళ్ లో మంచి విజయం సాధించింది ఈ సినిమా. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తుంది. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా పలువురు మహిళా డ్రైవర్స్ తో కలిసి డ్రైవర్ జామున సినిమా స్పెషల్ షో చూశారు హీరోయిన్ ఐశ్వర్య. అనంతరం ఆ మహిళా డ్రైవర్స్ తో ముచ్చటించారు.

Rashmika-Rishab : రష్మికని మర్చిపోయారా? కావాలనే ట్యాగ్ చేయలేదా?? మరోసారి రిషబ్-రష్మిక వివాదం..

ఈ నేపథ్యంలో వారిలోంచి కష్టపడుతున్న ఓ మహిళా ఆటో డ్రైవర్ ని ఎంపిక చేసి ఐశ్వర్య రాజేష్ చేతుల మీదుగా కొత్త ఆటోని అందించారు చిత్ర యూనిట్. దీంతో ఆ మహిళ సంతోషం వ్యక్తం చేస్తుంది. మహిళా డ్రైవర్స్ కూడా ఆమెతో మాట్లాడి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.