Akhanda : కొత్త సినిమా సెట్‌లో బాలయ్య ‘అఖండ’ వేడుక..

'అఖండ' సినిమా శత దినోత్సవ వేడుకల్ని ఇవాళ (మార్చ్ 12న) కర్నూల్ లో నిర్వహించబోతున్నారు. అయితే ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న తన 107వ సినిమా షూటింగ్ లో.......

Akhanda : కొత్త సినిమా సెట్‌లో బాలయ్య ‘అఖండ’ వేడుక..

New Project

Akhanda :  గత సంవత్సరం చివర్లో వచ్చిన బాలకృష్ణ ‘అఖండ’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మన అందరికి తెలిసిందే. బాలయ్య బాబు యాక్షన్ సీన్స్, బోయపాటి మేకింగ్, తమన్ BGM అన్ని కలిపి ‘అఖండ’ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. ‘అఖండ’ సినిమాతో బాలకృష్ణ-బోయపాటి కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. తాజాగా ‘అఖండ’ సినిమా శత దినోత్సవ వేడుకల్ని కూడా చేయబోతున్నారు.

‘అఖండ’ సినిమా శత దినోత్సవ వేడుకల్ని ఇవాళ (మార్చ్ 12న) కర్నూల్ లో నిర్వహించబోతున్నారు. అయితే ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న తన 107వ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ‘అఖండ’ సినిమా రిలీజ్ అయి 100 రోజులు పూర్తైన సందర్భంగా ‘అఖండ’ టీమ్‌ NBK 107 సెట్ లో సెలబ్రేషన్స్‌ జరిపారు. దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి బాలయ్యని కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.

Balayya

Upendra : మళ్ళీ డైరెక్టర్‌గా ఉపేంద్ర.. సింగిల్ లెటర్ టైటిల్‌తో పాన్ ఇండియా సినిమాగా..

Balayya2

ఆ తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా బాలకృష్ణకి పుష్ప గుచ్చం అందచేసి అభినందనలు తెలిపారు. ఈ ఫోటోలలో బాలయ్య బాబు లుక్ అదిరిపోయింది. ఈ ఫొటోలతో సినిమాలో బాలకృష్ణ లుక్ బయటకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత అందరు కలిసి లంచ్ చేశారు. ఇవాళ కర్నూల్ లో జరగనున్న శత దినోత్సవ వేడుకలో బాలకృష్ణ, బోయపాటి, తదితరులు పాల్గొననున్నారు.

Balayya1