Akhanda Teaser: టీజర్‌తో మరో లెవల్‌కు చేరిన అఖండ గర్జన!

నందమూరి అభిమానులు చాలాకాలంగా ఆకలి మీదున్నారు. ఈక్రమంలోనే ఇప్పటికే రెండు భారీ హిట్స్ ఇచ్చిన బోయపాటితో సినిమా అనగానే అభిమానులలో ఒక్కసారిగా జోష్ పెరిగింది. అనుకున్నట్లుగా బీబీ3 పోస్టర్స్, ఫస్ట్ లుక్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. పెరిగిన అంచనాలకు తగ్గట్లే టీజర్స్ దుమ్ములేపాయి.

Akhanda Teaser: టీజర్‌తో మరో లెవల్‌కు చేరిన అఖండ గర్జన!

Akhanda Teaser A Huge Roar That Took It To Another Level With The Teaser

Akhanda Teaser: నందమూరి అభిమానులు చాలాకాలంగా ఆకలి మీదున్నారు. ఇటు అబ్బాయిలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ గత రెండేళ్లుగా నుండి ఒక్క సినిమా విడుదల చేయకపోగా బాబాయ్ బాలయ్య అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం గౌతమి పుత్ర, పైసా వసూల్ సినిమాల తర్వాత అభిమానులను నిరుత్సాహ పరుస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే ఇప్పటికే రెండు భారీ హిట్స్ ఇచ్చిన బోయపాటితో సినిమా అనగానే అభిమానులలో ఒక్కసారిగా జోష్ పెరిగింది. అనుకున్నట్లుగా బీబీ3 పోస్టర్స్, ఫస్ట్ లుక్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. పెరిగిన అంచనాలకు తగ్గట్లే టీజర్స్ దుమ్ములేపాయి.

ఇక తెలుగు నూతన సంవత్సరం ఉగాది కానుకగా అభిమానులకు బీబీ 3 టీజర్ ట్రీట్ ఇచ్చింది. క్రేజీ కాంబినేషన్ కు మరింత అంచనాలను పెంచేలా టైటిల్ తో పాటు కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది అంటూ పవర్ ఫుల్ డైలాగులతో బాలయ్య గర్జన చూపించారు. ఊహించని మేకోవర్ లో బాలయ్య బోయపాటి మార్క్ డైలాగ్స్ సహా ఆ బ్యాక్ గ్రౌడ్ విజువల్స్, థమన్ అవుట్ స్టాండింగ్ బీజీఎం చూసిన ప్రతీ ఒక్కరికీ బీబీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. యూనిట్ ఊహించకుండానే ఇచ్చిన ఈ సర్ప్రైజ్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది.

అఖండ గర్జన ఉగాది టీజర్ యూట్యూబ్ లో కూడా అదరగొడుతుంది. 24 గంటలు కూడా గడవకముందే 6 మిలియన్ వ్యూస్ సాధించి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దీనిని బట్టి ఈ కాంబినేషన్ సినిమాపై ఎలాంటి అంచనాలు సెట్టయ్యాయో మనం అర్ధం చేసుకోవచ్చు. గతంలో విడుదల చేసిన ఫస్ట్ రోర్ ను మించి ఈ అఖండ గర్జన మాంచి కిక్కివ్వడంతో అభిమానులు సినిమా మీద అంచనాలు పెంచేసుకుంటున్నారు. మరి సినిమా విడుదల రోజుకి ఈ అంచనాలు ఎక్కడ వరకు చేరతాయో చూడాల్సి ఉంది.

read: Akhanda : కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.. ‘అఖండ’ గా నట‘సింహా’ గర్జన..