Akshay Kumar : ఆ రెండు సినిమాల వల్ల ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్ రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసిన అక్షయ్.. అవేంటో తెలుసా..?

అక్షయ్ కుమార్ 'ఆకాశం నీ హద్దురా' రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆ రెండు సినిమాలు వల్ల ఈ చిత్రాన్ని..

Akshay Kumar : ఆ రెండు సినిమాల వల్ల ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్ రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసిన అక్షయ్.. అవేంటో తెలుసా..?

Akshay Kumar Postpone Soorarai Pottru remake to february 2024

Akshay Kumar : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఒక హిట్టు కోసం తెగ కష్ట పడుతున్నాడు. 2021 నుంచి 8 సినిమాల్లో నటించగా ఒక్కటి హిట్టు అందించలేక పోయింది. చివరిగా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’ని రీమేక్ చేసి భారీ స్థాయిలో ప్రమోట్ చేసి లాభం లేకుండా పోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక ఘోర పరాజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సౌత్ సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతుంది.

Salaar : టీజర్‌తో కేజీఎఫ్ 2 రికార్డు బద్దలుకొట్టిన సలార్.. మొదటి 5లో నాలుగు ప్రభాస్ పేరునే..

2020 లో తమిళ్ హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమాని హిందీలో అక్షయ్ కుమార్ హీరో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ ని కూడా సుధా కొంగరనే తెరకెక్కిస్తుంది. ఈ రీమేక్ లో సూర్య ఒక గెస్ట్ రోల్ కూడా చేస్తున్నాడు. కాగా ఈ మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా పోస్ట్‌పోన్ అయ్యి ఏకంగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది.

ఇందుకు కారణం అక్షయ్ నటిస్తున్న మరో రెండు సినిమాలే కారణం. 2012 లో అక్షయ్ నటించిన సూపర్ హిట్ మూవీ OMG (తెలుగులో గోపాల గోపాల) కి ఇప్పుడు సీక్వెల్ (OMG 2) తెరకెక్కిస్తున్నారు. మొదటి సినిమా శ్రీకృష్ణుడు నేపథ్యంతో తెరకెక్కితే, ఈ సీక్వెల్ శివుడి కథాంశంతో రానుంది. ఆగష్టు 11న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక అక్టోబర్ 5న అక్షయ్ నటిస్తున్న రియల్ లైఫ్ స్టోరీ ‘ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ’ (The Great Indian Rescue) మూవీ రిలీజ్ కానుంది. వెస్ట్ బెంగాల్ రానిగంజ్ బొగ్గు గనుల్లో జరిగిన యాక్సిడెంట్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆకాశం నీ హద్దురా రీమేక్ కి ఒక మంచి రిలీజ్ సమయం కావాలని అక్షయ్ భావించి 2024 ఫిబ్రవరి 16 కు షిఫ్ట్ చేశాడట.