Alexa Male Voice : అమెజాన్ అలెక్సాకు ఐదేళ్లు.. భారతీయ యూజర్లు అలెక్సాలో ‘మేల్ వాయిస్’కు మార్చుకోవచ్చు..!
Alexa Male Voice : అమెజాన్ అలెక్సా భారత ప్రముఖ వర్చువల్ అసిస్టెంట్‌గా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్ అలెక్సా డివైజ్‌లపై స్పెషల్ ఆఫర్‌లను ప్రకటించింది. ఇందులో ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీ డివైజ్‌లు ఉన్నాయి.

'Alexa change your voice', Amazon launches male voice for Alexa _ Know what's new
Alexa Male Voice : అమెజాన్ అలెక్సా (Amazon Alexa) భారత ప్రముఖ వర్చువల్ అసిస్టెంట్‌గా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్ అలెక్సా డివైజ్‌లపై స్పెషల్ ఆఫర్‌లను ప్రకటించింది. ఇందులో ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీ డివైజ్‌లు ఉన్నాయి. అదనంగా, అమెజాన్ దేశంలోని అలెక్సా యూజర్ల కోసం కొత్త ‘మేల్ వాయిస్’ ఆప్షన్ కూడా ప్రవేశపెట్టింది.
భారతీయ వినియోగదారులకు ఇప్పుడు అలెక్సా ఒరిజినల్ వాయిస్ నుంచి కొత్త మేల్ వాయిస్ మధ్య మారే అవకాశం ఉంటుందని అమెజాన్ ఇటీవల వెల్లడించింది. భారత్‌లోని వినియోగదారులు ఇంగ్లీష్, హిందీ భాషలలో ప్రతిస్పందించగల రెండు విభిన్న వాయిస్ ఆప్షన్‌ల నుంచి ఎంచుకోవడాన్ని మొదటిసారి సూచిస్తుంది.
అలెక్సా వాయిస్‌ని మార్చడానికి యూజర్లు తమ ఎకో డివైజ్‌లో ‘(Alexa change your voice)’ అని చెప్పవచ్చు లేదా అలెక్సా యాప్‌ని యాక్సెస్ చేయవచ్చు. ప్రాధాన్య వాయిస్ ఆప్షన్ ఎంచుకోవడానికి డివైజ్ సెట్టింగ్‌లకు నావిగేట్ చేయవచ్చు. అంతేకాకుండా, అలెక్సా, ఎకో, కంప్యూటర్, అమెజాన్‌తో సహా అందుబాటులో ఉన్న ఏవైనా Wake పదాలను ఉపయోగించి కస్టమర్‌లు ఇంగ్లీష్, హిందీ లేదా హింగ్లీష్‌లో ప్రశ్నలు అడగడానికి ఎంచుకోవచ్చు.

Alexa Male Voice : ‘Alexa change your voice’, Amazon launches male voice for Alexa
మార్చి 02, 2023 నుంచి మార్చి 04, 2023 వరకు (Amazon Alexa) ద్వారా ఆధారితమైన డివైజ్‌లపై డీల్‌లు, డిస్కౌంట్‌లను అందించే ప్లాన్లను ప్రకటించింది. మార్చి 2వ తేదీన Alexa డివైజ్‌ల కోసం అందుబాటులో ఉన్న డీల్స్, ఆఫర్‌లను కూడా కంపెనీ ప్రకటించనుంది.
అంతేకాకుండా, boAt, Noise, Philips, Syska ఇతర ప్రముఖ బ్రాండ్‌లు అందించే స్మార్ట్ హోమ్ గాడ్జెట్‌లు, Alexa-రెడీ డివైజ్ ఆప్షన్ సేకరణ నుంచి కస్టమర్‌లు సెర్చ్ చేయొచ్చు. ఆపై నచ్చిన డివైజ్ కొనుగోలు చేయవచ్చు. ‘చాలా మంది భారతీయ యూజర్లు తమ దినచర్యలో భాగంగా అలెక్సాతో ఇంటరాక్ట్ అవ్వొచ్చు.
గత ఐదు ఏళ్లుగా భారత్ కోసం అలెక్సాను రూపొందించడమే తమ లక్ష్యమని, వినోదాన్ని అందించడంతో పాటు టాస్క్‌లను పూర్తి చేయడం, డేటాను యాక్సెస్ చేసేందుకు కొత్త వాయిస్, టచ్, మోషన్, విజన్-ఎనేబుల్ ఆప్షన్ అందించడంపై కంపెనీ దృష్టి ఉంటుంది’ అని అమెజాన్ ఇండియా అలెక్సా కంట్రీ మేనేజర్ దిలీప్ ఆర్‌ఎస్ అన్నారు.