Telangana Liquor : లిక్కర్ స్కేల్ లో రికార్డు…డిసెంబర్ నెలలో రూ. 3 వేల 350 కోట్ల మద్యం అమ్మకాలు

హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. NTR మార్గ్, నెక్లెస్ రోడ్డు...

Telangana Liquor : లిక్కర్ స్కేల్ లో రికార్డు…డిసెంబర్ నెలలో రూ. 3 వేల 350 కోట్ల మద్యం అమ్మకాలు

No Drink (1)

Liquor Sales In Telangana : మరికొన్ని గంటల్లో మనం 2021కి గుడ్‌ బై చెప్పబోతున్నాం. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాం. తెలుగురాష్ట్రాల్లోని యువత రెండు రోజులు సెలబ్రేషన్స్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. చిన్న పార్టీ ఉంటే..లిక్కర్ కంపల్సరీ అంటారు మందుబాబులు. అదే న్యూ ఇయర్ అంటే..చెప్పేది ఏముంది. గ్లాసుల గలగల మధ్యన మస్త్ మజా చేసుకోవాల్సిందేనంటారు. మందుబాబులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి కూడా. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు చేసుకోవచ్చని ఆర్డర్స్ పాస్ చేశారు. కానీ..అప్పటి వరకు తాము కోరుకున్న మందు దొరుకుతుందో లేదో..సరుకు ఉంటుందో లేదోనని ముందుగానే మందుబాబులు లిక్కర్ ను కొనేశారు.

Read More : New Florona Corona Variant ఇజ్రాయెల్ లో బయటపడ్డ మరో కొత్తరకం కరోనా వేరియంట్ “ఫ్లోరోనా”

2021, డిసెంబర్ 01 నుంచి 31వ తేదీ శుక్రవారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగిపోయాయి. సరికొత్త రికార్డ్స్ నెలకొల్పారు మందుబాబులు. డిసెంబర్ 01 నుంచి 31వరకు రూ. 3 వేల 350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని, శుక్రవారం రోజు బిల్లింగ్ క్లోజ్ వరకు 40 లక్షల కేసుల లిక్కర్ సేల్ జరిగిందని ఆబ్కారీ శాఖ వెల్లడించింది. 34 లక్షల కేసుల బీర్లు కొనుగోలు చేశారని తెలిపింది. లిక్కర్ సేల్ లో ఇదే అత్యధికమని పేర్కొంది.

Read More : Prabhas : జపాన్‌లో ప్రభాస్ బాటిల్స్.. పెద్ద సంస్థే ప్రభాస్ ఫొటోని వాడేస్తుందిగా

మరోవైపు…

హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. NTR మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్‌లో వాహనాల రాకపోకలను బంద్ చేశారు పోలీసులు. BRK భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాల ట్రాఫిక్ తెలుగు తల్లి జంక్షన్ దగ్గర ఇక్బాల్ మినార్, లక్డికాపూల్‌, అయోధ్య వైపు మళ్లిస్తారు. లిబర్టీ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను ఎగువ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, లక్డికాపూల్ వైపు మళ్లిస్తారు. సాధారణ వాహనాల రాకపోకల కోసం సచివాలయానికి ఆనుకుని ఉన్న మింట్ కాంపౌండ్ లేన్‌ మూసివేయనున్నారు.