RRR Movie : ‘కొంచెం ఆగండి బ్రో.. మధ్యలో చెప్పు ఊడిపోయింది’..

‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టెప్స్ వేస్తే ఎలా ఉంటుందబ్బా..

RRR Movie : ‘కొంచెం ఆగండి బ్రో.. మధ్యలో చెప్పు ఊడిపోయింది’..

Rrr Bunny

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ అనే మాస్ ఆంథమ్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటకు ఎంతో మంది ఎన్నో రకాలుగా మూమెంట్స్ వేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇక మీమ్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు.

RRR Movie : ‘నాటు నాటు’ సాంగ్‌కి నడిరోడ్డుపై ఊరమాస్ డ్యాన్స్!

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత స్పీడ్‌గా ఉందో.. ముఖ్యంగా ఏదైనా ఓ బర్నింగ్ ఇష్యూ కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన వార్తల్లో కానీ మీమ్స్ అనేవి ఏ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ మీమ్స్ క్రియేట్ చేశారు.

Rashmika Mandanna : కోట్లు కోట్లు బొగ్గుకే ఖర్చు పెట్టెయ్యండి..

‘పుష్ప’ మూవీలో ‘శ్రీవల్లీ’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా బన్నీ స్టెప్ వేస్తుండగా చెప్పు ఊడిపోవడం.. దాన్ని తొడుక్కుని మళ్లీ మూమెంట్ వేసే షాట్స్ అదిరిపోయాయి. ఆ పాటలో బన్నీ పిక్స్.. తారక్ – చరణ్ ఫొటోల పక్కన పెట్టి.. ‘కొంచెం ఆగండి బ్రో.. మధ్యలో చెప్పు ఊడిపోయింది’ అంటూ క్రియేట్ చేసిన మీమ్స్ భలే వైరల్ అవుతున్నాయి.

Naatu Naatu Song : డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ! వీడియో వైరల్..