Akhanda : ఒకపక్క అల్లు అర్జున్.. మరో పక్క రాజమౌళి.. గట్టిగానే ప్లాన్ చేసిన బాలయ్య | Allu Arjun, Rajamouli as chief guests for Akhanda Pre release event

Akhanda : ఒకపక్క అల్లు అర్జున్.. మరో పక్క రాజమౌళి.. గట్టిగానే ప్లాన్ చేసిన బాలయ్య

అయితే ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ తో పాటు దర్శక ధీరుడు రాజమౌళి కూడా........

Akhanda : ఒకపక్క అల్లు అర్జున్.. మరో పక్క రాజమౌళి.. గట్టిగానే ప్లాన్ చేసిన బాలయ్య

Akhanda :  బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి హిట్ సినిమాల తర్వాత రాబోతున్న సినిమా ‘అఖండ’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు.

Prabhas : డిసెంబర్‌ నుంచి ‘ప్రాజెక్టు K’ చిత్రీకరణ.. జెట్‌స్పీడ్‌లో ప్రభాస్

అయితే ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని అనౌన్స్ చేశారు. ఇది ఎవ్వరూ ఊహించని విషయం. అల్లుఅర్జున్ బాలకృష్ణ సినిమా ఫంక్షన్ కి రావడమేంటి అని అనుకున్నారు. ఐతే ఇదంతా ప్రమోషన్స్ లో భాగమే అని తెలిసిపోతుంది. బాలయ్య ఆహాలో షో చేస్తుండటంతో అల్లు వారి ఫ్యామిలీతో ఉన్న స్నేహం బలపడటంతో పాటు, యూత్ కి కూడా అట్ట్రాక్ట్ అవ్వడానికి యూత్ లో మంచి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ ని చీఫ్ గెస్ట్ గా తీసుకొస్తున్నారు. అయితే ఒక్క అల్లు అర్జున్ అనుకుంటే ఇంకో గెస్ట్ ని కూడా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు నిర్మాతలు.

Chiranjeevi : శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి చిరంజీవి సాయం

ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ కి అల్లు అర్జున్ తో పాటు దర్శక ధీరుడు రాజమౌళి కూడా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. రాజమౌళి ఒకపక్క ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండి ఈ సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా వస్తున్నారు. గతంలో కూడా బాలయ్య సినిమాకి రాజమౌళి గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ హోదాలో రాబోతున్నారు రాజమౌళి. మొత్తానికి బాలకృష్ణ ‘అఖండ’ ప్రమోషన్స్ ని గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

×