Alexa Celebrity Voice : అలెక్సాలో అమితాబ్‌ బచ్చన్‌‌తో ఇలా మాట్లాడొచ్చు..!

అలెక్సాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో మాట్లాడొచ్చు.. హే అలెక్సా.. అమితాబ్ వాయిస్ కావాలంటే వెంటనే మీతో మాట్లాడిస్తుంది.

Alexa Celebrity Voice : అలెక్సాలో అమితాబ్‌ బచ్చన్‌‌తో ఇలా మాట్లాడొచ్చు..!

Amazon Alexa Gets Amitabh Bachchan’s Voice In India

Amitabh Bachchan’s Voice in India : అలెక్సాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో మాట్లాడొచ్చు.. హే అలెక్సా.. అమితాబ్ వాయిస్ కావాలంటే వెంటనే మీతో మాట్లాడిస్తుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గురువారమే 78ఏళ్ల అమితాబ్ వాయిస్ లాంచ్ చేసింది. అమెజాన్ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు గూగుల్ అసిస్టెంట్ (Google Assistant), ఆపిల్ సిరి (Apple Siri) ద్వారా అలెక్సా కమ్యూనికేషన్ వాయిస్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇందులో భారతీయ వినియోగదారుల కోసం Celebrity Voice ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ను ప్రారంభ దశలో భాగంగా 2019లో అమెరికాలో లాంచ్ చేసింది. అమెరికన్ యాక్టర్, ప్రొడ్యుసర్ Samuel L. Jackson వాయిస్ తో రిలీజ్ చేసింది. ఇప్పుడు భారతీయ యూజర్ల కోసం బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ వాయిస్ ను అలెక్సాలో తీసుకొచ్చింది. ఇంతకీ అలెక్సాలో అమితాబ్ వాయిస్ ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం..

అమెజాన్.. అలెక్సాలో అమితాబ్ వాయిస్ ను ప్రారంభ ధర రూ.149 (MRP – రూ. 299)తో ఏడాదిపాటు అందించనుంది. మీరు చేయాల్సిందిల్లా.. Hey Alexa.. introduce me to Amitab Bachchan అంటే చాలు.. Celebrity Voice ఆఫర్ చేస్తుంది. అయితే మీరు ఏడాది సబ్ స్ర్కిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే సెలబ్రిటీ వాయిస్ యాక్సస్ చేసుకోవచ్చు. Amazon వెబ్ సైట్ నుంచి ఈ కూడా సెలబ్రిటీ వాయిస్ కొనుగోలు చేయొచ్చు. ఒకసారి పేమెంట్ చేస్తే చాలు.. అప్పటినుంచి అమితాబ్ వాయిస్ తో మీరు ఇంట్రాక్ట్ కావొచ్చు.
Amazon Alexa : అమెజాన్ అలెక్సాలో వ్యాక్సిన్ సెంటర్ల సమాచారం

అమితాబ్ వాయిస్ తో మాట్లాడాలంటే.. అలెక్సాను Amit ji అని అడగాలి.. ఇది అమిత్ వాయిస్ ఎనేబుల్ అయ్యే పదం.. దీన్ని Wake Word అని పిలుస్తారు. డిఫాల్ట్ గా కూడా ఈ పదాన్ని యాక్సస్ చేసుకోవచ్చు. Alexa ద్వారా Voice Assistance లో Wake word పలికితే చాలు.. వెంటనే సెలబ్రిటీ వాయిస్ కనెక్ట్ అయిపోతుంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే అమెజాన్ అధికారికంగా ఈ వాయిస్ ఫీచర్ ప్రకటించింది. కొన్ని నెలలుగా అలెక్సాలో అమితాబ్ వాయిస్ ఎనేబుల్ చేసేందుకు టెస్టింగ్ జరిపింది. ఇప్పుడు అలెక్సాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ తమ యూజర్లను వారి ఫేవరెట్ యాక్టర్ల ద్వారా ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈ వాయిస్ (Voice Assistant) ఫీచర్ తీసుకొచ్చింది.

అంతేకాదు.. అమితాబ్ జీవితానికి సంబంధించి స్టోరీలను కూడ అలెక్సాలో అడగవచ్చు. అమితాబ్ తండ్రి, భారతీయ రచయిత Harivansh Rai Bachchan రచించిన పద్యాలను కూడా చదవొచ్చు. తన ఫేవరెట్ సాంగ్స్ కూడా వినొచ్చు. మోటివేషనల్ కొటేషన్లు కూడా వినొచ్చు. మీరు అలెక్సాలో మ్యూజిక్, అలారం, వెదర్ అప్ డేట్స్ అడిగినప్పుడు బచన్ సిగ్నేచర్ స్టయిల్ ద్వారా అలెక్సా మీకు అందిస్తుంది.
అమెజాన్‌ తెచ్చిన తంటా..ఆడపిల్లలకు ‘అలెక్సా’పేరు పెట్టటం మానేసారు