Amazon Fresh Prime Members : అమెజాన్ ప్రెష్ ప్రైమ్ యూజర్లకు అలర్ట్.. మినిమం కన్నా తక్కువ ఆర్డర్లపై ఉచిత కిరాణా డెలివరీ రద్దు..!

Amazon Fresh Prime Members : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్రైమ్ మెంబర్‌లకు 150 డాలర్లు (దాదాపు రూ. 12,200) కన్నా తక్కువ ఆర్డర్‌లపై అమెజాన్ ఉచిత కిరాణా డెలివరీని రద్దు చేస్తోంది.

Amazon Fresh Prime Members : అమెజాన్ ప్రెష్ ప్రైమ్ యూజర్లకు అలర్ట్.. మినిమం కన్నా తక్కువ ఆర్డర్లపై ఉచిత కిరాణా డెలివరీ రద్దు..!

Amazon Increases Minimum Purchase Amount on Amazon Fresh for Prime Members

Amazon Fresh Prime Members : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్రైమ్ మెంబర్‌లకు 150 డాలర్లు (దాదాపు రూ. 12,200) కన్నా తక్కువ ఆర్డర్‌లపై అమెజాన్ ఉచిత కిరాణా డెలివరీని రద్దు చేస్తోంది. అమెజాన్ ఫ్రెష్ నుంచి తమ కిరాణా సామాగ్రిని డెలివరీ చేసే ఆర్డర్లు 150 డాలర్ల కన్నా తక్కువ చెల్లించే కస్టమర్‌లకు ఆర్డర్ సైజు ఆధారంగా 3.95 (సుమారు రూ. 350), 9.95 డాలర్లు (సుమారు రూ. 800) వరకు వసూలు చేయడం జరుగుతుందని కంపెనీ ఈ-మెయిల్‌లో తెలిపింది.

ఈ కొత్త విధానం ఫిబ్రవరి 28 (శుక్రవారం) నుంచి ప్రైమ్ సభ్యులకు ప్రారంభం అవుతుంది. మిగతా అన్ని ఆర్డర్‌లపై అనుకూలమైన రెండు గంటల డెలివరీలను అందిస్తామని కంపెనీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కస్టమర్‌లు తక్కువ రుసుముతో ఆరు గంటల డెలివరీ విండోను ఎంచుకోవచ్చునని అమెజాన్ ఈమెయిల్‌లో తెలిపింది.

2005లో ప్రారంభమైన ప్రైమ్‌ (Amazon Prime)లో ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా మెంబర్లు ఉన్నారు. అమెజాన్ సంవత్సరానికి 139 డాలర్లు (దాదాపు రూ. 11,500) లేదా వేగవంతమైన షిప్పింగ్, ఉచిత డెలివరీ, రిటర్న్‌ల వంటి ఇతర పెర్క్‌ల కోసం నెలకు 14.99 డాలర్లు (సుమారు రూ. 1,200) చెల్లిస్తారు. ప్రస్తుతం, కంపెనీ 35 డాలర్లు (దాదాపు రూ. 3వేల) కన్నా ఎక్కువ ఆర్డర్‌లపై సభ్యులకు ఉచిత కిరాణా డెలివరీలను అందిస్తోంది.

Amazon Increases Minimum Purchase Amount on Amazon Fresh for Prime Members

Amazon Increases Minimum Purchase Amount on Amazon Fresh for Prime Members

Read Also : Airtel Free Amazon Prime Offer : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరే ఆఫర్.. ప్రీపెయిడ్ ప్లాన్లపై ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్.. మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

న్యూయార్క్ మినహా, ఇక్కడ 50 డాలర్లు (దాదాపు రూ. 4వేలు) వరకు ఉంటుంది. కొత్త పాలసీ ప్రకారం.. 100-150 డాలర్ల మధ్య ఆర్డర్‌లకు 3.95 డాలర్ల డెలివరీ ఛార్జీలు, 50 డాలర్ల నుంచి 100 డాలర్ల ఆర్డర్‌లకు 6.95 డాలర్లు (దాదాపు రూ. 600), 50లోపు డాలర్ల ఆర్డర్‌లకు 9.95 డాలర్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. అమెజాన్ ఫ్రెష్ డెలివరీలు 150 డాలర్లు కన్నా ఎక్కువగా ఉంటే ఫ్రీగా కిరాణా సామాగ్రిని డెలివరీ చేసుకోవచ్చు.

కిరాణా డెలివరీకి సంబంధించిన ఆర్డర్లను వేగవంతమైన హై క్వాలిటీ డెలివరీ అనుభవాన్ని అందిస్తుంది. ఆన్‌లైన్, ఫిజికల్ కిరాణా దుకాణాల్లో ధరలను తక్కువగా ఉంచడంలో సాయపడేందుకు కొన్ని అమెజాన్ లేటెస్ట్ డెలివరీ ఆర్డర్‌లపై సర్వీసు రుసుమును ప్రవేశపెడుతున్నామని అమెజాన్ ప్రతినిధి లారా హెండ్రిక్సన్ తెలిపారు.

అమెరికా అంతటా డజన్ల కొద్దీ అమెజాన్ ఫ్రెష్ స్టోర్‌లను కలిగి ఉంది. కొన్ని విదేశాలలోనూ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ 2017 నుంచి హోల్ ఫుడ్స్‌ను కూడా కలిగి ఉంది. గత కొన్ని నెలల్లో, వ్యాపారంలో లాభదాయకమైన ప్రాంతాలను తగ్గించింది. కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లో నియామకాన్ని నిలిపివేసింది. ఈ నెలలో 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Amazon Prime Phones Sale : అమెజాన్ ప్రైమ్ ఫోన్స్ సేల్.. షావోమీ 12ప్రో, శాంసంగ్ గెలాక్సీ M13పై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!