Amazon Prime: 43శాతం పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్

అమెజాన్ కొన్ని దేశాల్లో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరను పెంచాలని చూస్తోంది. సెప్టెంబర్‌ నాటికల్లా కొత్తధరలను అమలు చేయాలనే యోచనలో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం 43 శాతం వరకు పెరుగుతుందని, అయినప్పటికీ ధరల పెంపు శాతం వివిధ దేశాలలో ఒకేలా ఉండదని పేర్కొంది.

Amazon Prime: 43శాతం పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్

Prime Video

 

Amazon Prime: అమెజాన్ కొన్ని దేశాల్లో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరను పెంచాలని చూస్తోంది. సెప్టెంబర్‌ నాటికల్లా కొత్తధరలను అమలు చేయాలనే యోచనలో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం 43 శాతం వరకు పెరుగుతుందని, అయినప్పటికీ ధరల పెంపు శాతం వివిధ దేశాలలో ఒకేలా ఉండదని పేర్కొంది.

ఫ్రాన్స్ 43 శాతం ధరలను పెంచగా.. ఫ్రాన్స్‌లో ఉన్న వ్యక్తులు సంవత్సరానికి EUR 69.90 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 5వేల 640. ఇటలీ, స్పెయిన్‌లలో 39 శాతం పెంచగా దీని ధర EUR 49.90 (దాదాపు రూ. 4వేల 32)గా ఉంటుంది. UKలో, వార్షిక ఖరీదు £95 (దాదాపు రూ. 9,070), జర్మనీలో నివసిస్తున్న వ్యక్తులు EUR 89.90 (సుమారు రూ. 8,590) చెల్లించాల్సి ఉంటుంది.

US తర్వాత అమెజాన్‌కు మూడో అతిపెద్ద మార్కెట్ UK.

Read Also: అమెజాన్ ప్రైమ్ ఫ్రీ.. ఫ్రీ.. ఆఫర్ 2 రోజుల మాత్రమే.. రండి, త్వరపడండి

భారతదేశంలో Amazon Prime మెంబర్‌షిప్ ధర నెలకు రూ. 179 నుండి రూ. 129 నుండి ప్రారంభమవుతుంది. మూడు నెలల ధర రూ. 459, సంవత్సరానికి రూ. 1,499.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఖర్చు పెరగడం వెనుక ప్రధాన కారణం “పెరిగిన ద్రవ్యోల్బణం, నిర్వహణ ఖర్చులు” అని యాజమాన్యం పేర్కొంది. సకాలంలో మంచి కంటెంట్‌ను డెలివరీ చేయడానికి ధరల పెంపు అవసరమని అమెజాన్ సూచించింది.