Amazon Prime: అమెజాన్ ప్రైమ్ ఫ్రీ.. ఫ్రీ.. ఆఫర్ 2 రోజుల మాత్రమే.. రండి, త్వరపడండి

అమెజాన్ మెంబర్‌షిప్ ఫ్రీగా చేజిక్కించుకునే ఛాన్స్... కేవలం రెండు రోజులు మాత్రమే. అవును నిజమే. ఇది అమెజాన్ అందిస్తున్న ఆన్‌లైన్‌ షాపింగ్‌ బెనిఫిట్. 2022 జూలై 23, 24 తేదీల్లో జరగనున్న అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌‌లో నచ్చిన వస్తువు కొనండి వచ్చిన ఆఫర్ ను ఎంజాయ్ చేయండి.

Amazon Prime: అమెజాన్ ప్రైమ్ ఫ్రీ.. ఫ్రీ.. ఆఫర్ 2 రోజుల మాత్రమే.. రండి, త్వరపడండి

Amazon Prime Day Sales On July 23 Deals On Iphone 13, Iqoo Z6 And More Revealed (2)

 

 

Amazon Prime: అమెజాన్ మెంబర్‌షిప్ ఫ్రీగా చేజిక్కించుకునే ఛాన్స్… కేవలం రెండు రోజులు మాత్రమే. అవును నిజమే. ఇది అమెజాన్ అందిస్తున్న ఆన్‌లైన్‌ షాపింగ్‌ బెనిఫిట్. 2022 జూలై 23, 24 తేదీల్లో జరగనున్న అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌‌లో నచ్చిన వస్తువు కొనండి వచ్చిన ఆఫర్ ను ఎంజాయ్ చేయండి.

పైగా ఇందులో అమెజాన్ మెంబర్‌షిప్ ఫ్రీ ఆఫర్ కూడా ఉంది. ఇందులోని ఏకైక కండీషన్ ఏంటంటే.. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు మాత్రమే ఈ సేల్‍లో పాల్గొనాలి. వారికి అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ఉచితంగా డెలివరీ, కొన్ని ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్, ప్రైమ్ వీడియో యాక్సెస్ లాంటి బెనిఫిట్స్ బోలెడు ఉన్నాయి.

ఇతరులు ఈ సేల్‌లో పాల్గొనేందుకు ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కావాలి కదా. దాని కోసం ఆ సంస్థ మొబైల్‌ వినియోగదారులకు ఓ బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం మొబైల్‌ని రీచార్జ్‌ చేసుకుని అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందే ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ని.. ఎయిర్‌టెల్, వోడాఫోన్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు.

Read Also: జూలై 23 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

అందులో కొన్ని సెలక్టెడ్‌ ప్లాన్‌లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ని లింక్‌ చేశారు. ఈ రీచార్జ్‌లు చేసుకున్నవారికి నిబంధనల ప్రకారం ఉచిత సబ్‌స్క్రిప్షన్ వర్తిస్తుంది.

ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వచ్చే ప్లాన్‌లు ఇవే:
Airtel Rs.359 postpaid plan:
ఎయిర్‌టెల్ రూ.359 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే 28 రోజుల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజుకు 2 జీబీ డేటీ వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ తరహాలోనే ఎయిర్‌టెల్‌ కస్టమర్లు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు .. 499, 699, 999, 1199, 1599 లాంటి ప్లాన్ లు కూడా తీసుకోవచ్చు.

Jio Rs.399 PostPaid Plan:
జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 75జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు జియో ప్లాన్‌ జాబితా.. 599, 399, 799, 1499 లాంటి ప్లాన్‌లు కూడా తీసుకోవచ్చు.

Vi Rs.999 postpaid plan:

వొడాఫోన్ ఐడియా రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే 6నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 220 డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు వొడాఫోన్‌ ప్లాన్‌ జాబితా.. 499, 699, 999, 1099, 1299,1699, 2299 లాంటి ప్లాన్‌లు కూడా తీసుకోవచ్చు.